శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత | Hyderabad airport implements e-boarding | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత

Published Wed, Jul 22 2015 9:06 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత

శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత

హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. మన దేశంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానాన్ని అమలుచేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది.

ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న పౌర విమానయాన శాఖ.. ముందుగా గత ఏప్రిల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో జెట్ ఎయిర్ వేస్ సహకారం కూడా ఉంది. ఈ మూడు నెలల కాలంలో దాదాపు 700 మంది ప్రయాణికులు ఈ- బోర్డింగ్ విధానాన్ని వినియోగించుకున్నారని, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఈ- బోర్డింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేసినందుకు గానూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని   బుధవారం జీఎంఆర్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం స్పూర్తితో మరిన్ని ఎయిర్ పోర్టుల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు విమానయాన శాఖ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement