e-boarding
-
శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్జీఐఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో దేశంలో ఈ-బోర్డింగ్ సౌకర్యం ఉన్న తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి ఆర్జీఐఏ ఈ ప్రాజెక్టును అమలు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 7 వేల మందికిపైగా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును ముంబై, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లోనూ ప్రారంభించారు. సంప్రదాయ పేపర్ బోర్డింగ్ పాస్‌లకు బదులు ఎలక్ట్రానిక్ విధానంలో చెక్-ఇన్ పూర్తి చేసేందుకు ఈ-బోర్డింగ్ దోహదం చేస్తుంది. ఈ సౌకర్యం కావాల్సిన ప్రయాణికులు ముందుగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలతో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. మన దేశంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానాన్ని అమలుచేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న పౌర విమానయాన శాఖ.. ముందుగా గత ఏప్రిల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో జెట్ ఎయిర్ వేస్ సహకారం కూడా ఉంది. ఈ మూడు నెలల కాలంలో దాదాపు 700 మంది ప్రయాణికులు ఈ- బోర్డింగ్ విధానాన్ని వినియోగించుకున్నారని, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఈ- బోర్డింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేసినందుకు గానూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని బుధవారం జీఎంఆర్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం స్పూర్తితో మరిన్ని ఎయిర్ పోర్టుల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు విమానయాన శాఖ పేర్కొంది.