శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్‌జీఐఏ | Full-boarding pilot in Shamshabad: RGIA | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్‌జీఐఏ

Published Thu, Jul 23 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్‌జీఐఏ

శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్‌జీఐఏ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో దేశంలో ఈ-బోర్డింగ్ సౌకర్యం ఉన్న తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి ఆర్‌జీఐఏ ఈ ప్రాజెక్టును అమలు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 7 వేల మందికిపైగా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును ముంబై, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లోనూ ప్రారంభించారు. సంప్రదాయ పేపర్ బోర్డింగ్ పాస్‌లకు బదులు ఎలక్ట్రానిక్ విధానంలో చెక్-ఇన్ పూర్తి చేసేందుకు ఈ-బోర్డింగ్ దోహదం చేస్తుంది. ఈ సౌకర్యం కావాల్సిన ప్రయాణికులు ముందుగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలతో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement