మల్లేపల్లిలో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 56 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.