పఠాన్కోట్లో కొనసాగుతున్న ఆపరేషన్ | Search operation continues at Pathankot air base after attack | Sakshi
Sakshi News home page

పఠాన్కోట్లో కొనసాగుతున్న ఆపరేషన్

Published Sun, Jan 3 2016 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

పఠాన్కోట్లో కొనసాగుతున్న ఆపరేషన్

పఠాన్కోట్లో కొనసాగుతున్న ఆపరేషన్

పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్లో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎయిర్బేస్ నుంచి ఆదివారం ఉదయం తుపాకీ కాల్పులు, పేలుడు వినిపించినట్టు స్థానికుల సమాచారం. దీంతో మరో ఉగ్రవాది ఎయిర్బేస్లో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. భద్రత బలగాలు ఈ రోజు ఉదయం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్, పారామిలటరీ బలగాలు, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ గ్రనేడ్ పేలడంతో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.


శనివారం పఠాన్కోట్ ఎయిర్బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. భద్రత బలగాలు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చగా.. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement