punjab terrorists attack
-
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రత బలగాలు నిర్ధారించాయి. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు భద్రత బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐఈడీ పేలుడులో నిరంజన్ సింగ్ అనే అధికారి మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
పఠాన్‌కోట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎయిర్‌బేస్ నుంచి ఆదివారం ఉదయం తుపాకీ కాల్పులు, పేలుడు వినిపించినట్టు స్థానికుల సమాచారం. దీంతో మరో ఉగ్రవాది ఎయిర్‌బేస్‌లో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. భద్రత బలగాలు ఈ రోజు ఉదయం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్, పారామిలటరీ బలగాలు, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ గ్రనేడ్ పేలడంతో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. భద్రత బలగాలు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చగా.. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.