గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్‌కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే..
బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్‌మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్‌చల్)
ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్‌మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు)
ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్‌మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్‌లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment