పచ్చని కానుక
యూసఫ్‌గూడలో రామరాజనే పెద్దాయన మనవడి పుట్టిన రోజు వేడుక సందర్భంగా పిల్లలకి ఆటపాటలు, క్విజ్, నృత్యాల పోటీలు నిర్వహించి, గెలిచిన పిల్లలకి మొక్కల్ని కానుక లుగా అందించారు. నల్లకుంటలో పెళ్లికూతురు కాబోయే వరుడి దగ్గర్నుంచి నీట్‌గా ప్యాక్ చేసిన బోన్సాయ్ ప్లాంట్‌ను గిఫ్ట్‌గా అందుకుంది.
క్రాస్ రోడ్స్‌లో నివసించే ప్రవీణ్... తమ మ్యారేజ్ డే సందర్భంగా అతిధులకు మొక్కల్ని కానుకగా ఇచ్చి ఆనందం పంచారు. ఈ ధోరణి మరింత పెరిగితే... పచ్చని బహుమతులు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం బలపడితే...హరితహారం...సాకారం కావడం తధ్యం అంటున్నారు పర్యావరణ ప్రియులు. సిటీలో పెరుగుతున్న గ్రీన్ గిఫ్టింగ్ గురించి నేటి ‘సండే స్పెషల్’లో... సాక్షి, సిటీబ్యూరో