సమంత: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్‌ వైరల్‌ | Samantha Last Year Marriage Day Post for Naga Chaitanya Viral Now | Sakshi
Sakshi News home page

ChaySam: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్‌ వైరల్‌

Published Wed, Oct 6 2021 7:09 PM | Last Updated on Thu, Oct 7 2021 6:41 PM

Samantha Last Year Marriage Day Post for Naga Chaitanya Viral Now - Sakshi

ChaySam Divorce: సమంత-నాగచైతన్య.. కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అన్ని బాగుంటే.. ఈ రోజు (అక్టోబర్‌7)వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు. కానీ కొన్ని రోజులు క్రితం చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో ఏడాది క్రితం సమంత చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ తాజాగా మరో సారి వైరలవుతోంది. ఈ జంట కలిసి ఉంటే ఈ రోజు మ్యారేజ్‌ డే జరుపుకునేవారు. ఈ క్రమంలో గతేడాది పెళ్లి రోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసి.. ‘‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌’’ అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు.
(చదవండి: చై-సామ్‌ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్‌ ఇలా బయట పెట్టాడా?)

తాజాగా ఈ పోస్ట్‌ మరోసారి వైరలవుతోంది. ఇప్పటికి వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు.. ‘‘గతేడాది ఇదే సమయంలో మీ ఇద్దరి మధ్య హద్దుల్లేని ప్రేమ, అభిమానాలు.. ఇప్పుడు అంతంలేని దూరం.. ఎందుకిలా జరిగింది.. ఏడాదిలోపే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారు.. మీరిద్దరు తిరిగి కలిసిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.. ఈ ఫోటో చూస్తే నాకు చాలా బాధగా ఉంది.. మీరు మా హృదయాలను ముక్కలు చేశారు’’ అంటూ నెటిజనులు బాధపడుతున్నారు. 

ఇక చై-సామ్‌ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవం వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీరిద్దరు తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాలను ఎలా మలుపుతిప్పుతుందో కాలమే నిర్ణయిస్తుంది. 

చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి
ChaySam Divorce: ఏం జరిగిందో తెలియదు..చైతన్య చాలా కూల్‌: రాజీవ్‌ కనకాల
ChaySam Divorce: చై-సామ్‌ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్‌ ఇలా బయట పెట్టాడా?
ChaySam Divorce: ‘మరోసారి ఆలోచించుకోమని సామ్‌కు చెప్పాను’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement