చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య | husband is her partner in crime, SAYS hero wife | Sakshi
Sakshi News home page

చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య

Published Tue, Jan 17 2017 5:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య

చంపుకోవాలని యత్నిస్తున్నాం.. కానీ: హీరో భార్య

’గత 16 ఏళ్లుగా ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మేం ఇప్పటివరకు విజయవంతం కాలేదు. 16వ వివాహ దినోత్సవం వచ్చేసింది. నేరంలో మేం భాగస్వాములం’ అంటూ ప్రముఖ నటి ట్వింకిల్‌ ఖన్నా ట్వీట్‌ చేసింది. బాలీవుడ్‌ యాక‌్షన్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌-ట్వింకిల్‌ ఖన్నా వైవాహిక జీవితంలో అడుగుపెట్టి నేటికి 16 ఏళ్లు. బాలీవుడ్‌ లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కపుల్‌ గా పేరొందిన ఈ జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్వింకిల్‌ ఖన్నా ఇలా సరదా కామెంట్‌ పెట్టి.. అక్షయ్‌, తాను కరాటే ఫైటింగ్‌ చేస్తున్న చిన్న వీడియో బిట్‌ ను పోస్టు చేసింది.

’జుల్మీ’, ’ఇంటర్నేషనల్‌ ఖిలాడీ’ వంటి సినిమాల్లో కలిసి నటించిన అక్షయ్‌, ట్వింకిల్‌ 2001లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2002లో కొడుకు ఆరవ్‌, 2012లో కూతురు నిటారా జన్మించారు. ప్రస్తుతం వరుస సూపర్‌ హిట్‌లతో దూసుకుపోతున్న అక్షయ్‌ త్వరలోనే ’జాలీ ఎల్‌ఎల్‌బీ-2’  ప్రేక్షకుల ముందుకురానునన్నాడు. అలాగే ’టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమకథ’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement