

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లిరోజు(డిసెంబరు 11)

విరుష్క జోడీ 2017, డిసెంబరు 11న తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించారు

ఇటలీలోని టస్కనీలో అత్యంత సన్నిహితుల నడుమ విరాట్- అనుష్కల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది

ఈ క్రమంలో ఏడో పెళ్లిరోజు జరుపుకొంటున్న విరుష్క జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

ఈ నేపథ్యంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ నాడు విరాట్- అనుష్కలను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది

విరుష్కకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘మీ ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్! కోహ్లి.. ఇకపై నీతో పాటు హజ్బెండ్ బుక్ షేర్ చేసుకుంటా. అలాగే అనుష్క శర్మ.. నువ్వు నీ ఇంటిపేరును అలాగే ఉంచు’’ అంటూ రోహిత్ 2017లో ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను అభిమానులు వైరల్ చేస్తున్నారు

సెలబ్రిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటగా పేరొందిన విరుష్కకు ఇద్దరు సంతానం

2021, జనవరి 11న కూతురు వామికకు, 2024, ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్‌కు విరాట్- అనుష్కలు జన్మనిచ్చారు.





