Sunder
-
ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.Oru semma Family entertainer!Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024 -
అందుకే కాంగ్రెస్‌కు గుడ్ బై: కుష్బూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు సీనియర్ నటి కుష్బూ సుందర్ తెలిపారు. సోమవారం కమలం పార్టీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేశాన్ని ప్రధాని మోదీ సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడానో సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నానని వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ విజయం కోసం పనిచేయలేదన్నారు. తాను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదని, తన రాజీనామాకు అది కారణం కాదన్నారు. తనతో కాంగ్రెస్ నేతలకు ఈగో సమస్యలు ఉన్నాయోమోనని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తనలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని వాపోయారు. బీజేపీలో తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధి నాయకత్వం నిర్ణయిస్తుందని కుష్బూ సుందర్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ సమక్షంలో అంతకుముందు బీజేపీలో కుష్బూ చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కుష్బూ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ సరిగా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుష్బూకు బీజేపీ ఎటువంటి బాధ్యతలు కట్టబెడుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తమ పార్టీ నుంచి కుష్బూ వెళ్లిపోయినా నష్టం ఏమీ ఉండబోదని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ -
హాయ్ హారర్
‘ఇలాంటి సినిమాలో నటించాలి’ అని ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ‘విష్ లిస్ట్’ ఉంటుంది. అది నెరవేరే టైమ్ వచ్చినపుడు ఆనందపడిపోతారు. ఇప్పుడు రాశీ ఖన్నా ఆ ఆనందంలోనే ఉన్నారు. ఈ బ్యూటీ విష్ లిస్ట్‌లో హారర్ సినిమా చేయాలని ఉంది. ‘అరణ్మణై 3’తో హారర్ జానర్‌కి హాయ్ చెప్పే అవకాశం ఆమెకు వచ్చింది. సుందర్. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మౖణె’, ‘అరణ్మణై 2’ పెద్ద హిట్. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుందర్ సిద్ధమయ్యారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించబోతున్నారు. ఆండ్రియా మరో కథానాయిక. ఆర్య హీరో. తొలి, మలి భాగాల్లో నటించిన సుందర్ ఇందులోనూ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘హారర్ జానర్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అరణ్మణై’ సిరీస్‌తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ చూశాను. చాలా బాగుంటాయి. మూడో భాగం షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. ఫిబ్రవరి నెలాఖరున లేక మార్చిలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. -
సుందర్... ఈ ‘వాషింగ్టన్’ ఏమిటి?
వాషింగ్టన్ సుందర్... ఇతడి ఎంపికే కాదు... పేరు, ఆటతీరూ ప్రత్యేకమే. భాషకు ప్రాధాన్యమిచ్చే తమిళనాడుకు చెందిన వాడైనా ‘వాషింగ్టన్’ అని పేరుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. దీని వెనుకో కథనం ఉంది. అదేంటంటే... వాషింగ్టన్ తండ్రి ఎం.సుందర్ మాజీ లీగ్ క్రికెటర్. పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ అనే మాజీ సైనికుడు అన్ని విధాలా ఆయనకు అండగా నిలిచారు. ఆ పెద్దాయన 1999లో చనిపోయారు. కొన్నాళ్లకే... సుందర్‌కు కొడుకు పుట్టాడు. తనకు సాయపడిన వ్యక్తిపై గౌరవంతో కుమారుడికి ‘వాషింగ్టన్’ అని పేరు పెట్టుకున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ అండర్–19 జాతీయ జట్టు, తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. సహజంగా ఆఫ్ స్పిన్నర్లు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయి ఉంటారు. ఇతడు మాత్రం ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్. ఇటీవలి కాలంలో భారత క్రికెట్లో ఈ తరహాలో ఎవరూ లేకపోవడం విశేషం. -
హన్సిక 'చంద్రకళ' స్టిల్స్