ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Tamannaah's Aranmanai 4 Streaming From June 21 On Disney Hotstar | Sakshi
Sakshi News home page

Aranmanai 4 OTT Release: ఓటీటీకి రూ.100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Jun 5 2024 9:45 PM | Last Updated on Thu, Jun 6 2024 9:48 AM

Tamannaah's Aranmanai 4 Streaming From June 21 On Disney Hotstar

మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్‌ సి స్వీయ  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది.  20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్‌ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement