‘ఇలాంటి సినిమాలో నటించాలి’ అని ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ‘విష్ లిస్ట్’ ఉంటుంది. అది నెరవేరే టైమ్ వచ్చినపుడు ఆనందపడిపోతారు. ఇప్పుడు రాశీ ఖన్నా ఆ ఆనందంలోనే ఉన్నారు. ఈ బ్యూటీ విష్ లిస్ట్‌లో హారర్ సినిమా చేయాలని ఉంది. ‘అరణ్‌మణై 3’తో హారర్ జానర్‌కి హాయ్ చెప్పే అవకాశం ఆమెకు వచ్చింది. సుందర్. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్‌మౖణె’, ‘అరణ్‌మణై 2’ పెద్ద హిట్. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుందర్ సిద్ధమయ్యారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించబోతున్నారు.
ఆండ్రియా మరో కథానాయిక. ఆర్య హీరో. తొలి, మలి భాగాల్లో నటించిన సుందర్ ఇందులోనూ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘హారర్ జానర్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అరణ్‌మణై’ సిరీస్‌తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ చూశాను. చాలా బాగుంటాయి. మూడో భాగం షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. ఫిబ్రవరి నెలాఖరున లేక మార్చిలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment