
సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్ నటి కయాదు లోహార్‌నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్‌పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్‌పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో నటించారు.
అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు.
Comments
Please login to add a commentAdd a comment