అన్నా డీఎంకేలో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత విషయమని, తమిళనాడు పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయ తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. జైట్లీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.