VKSasikala
-
నోట్ల రద్దు వేళ శశికళ ఆస్తులు పైపైకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆదాయపన్ను శాఖ (ఐటీ) విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె మాల్స్, భవనాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు. మద్రాసు హైకోర్టులో శశికళ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. శశికళ ఆదాయ, ఆస్తుల వ్యవహారం ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు దానిపై విచారణ అవసరం లేదని శశికళ తరఫు లాయర్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్లలో షాపింగ్ మాల్స్ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్ ప్లాంట్లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు. -
'డీఎంకే కంటే శశికళనే బెస్ట్'
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన గందరగోళ పరిస్థితులపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. డీఎంకేను జాతి విద్రోహక, హింసాత్మక పార్టీగా అభివర్ణించారు. డీఎంకే కంటే జైలులో ఉన్న శశికళనే చాలా బెస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి చెందిన సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్షను నేడు డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటింగ్ ను మరోరోజు వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ జరుపాలంటూ ప్రతిపాదనలను తీసుకొచ్చారు. అయితే వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో డీఎంకే సభ్యులు ఆయనపై కుర్చీలు, పేపర్లు విసిరేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా వేశారు. -
కోర్టులో లొంగిపోయిన శశికళ
-
నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి: శశికళ
-
కోర్టులో లొంగిపోయిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాల్లో ఆమె న్యాయమూర్తి అశ్వర్థనారాయణ ఎదుట హాజరయ్యారు. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. కోర్టులో వీరి వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించి పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. తనను ప్రత్యేక ఖైదీగా పరగిణించాలన్న శశికళ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. శశికళ రాక ముందే ఆమె భర్త నటరాజన్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. అన్నా డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో అన్నా డీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన శశికళ నేరుగా బెంగళూరు పరప్పణ కోర్టుకు చేరుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో శశికళ గతంలో అనుభవించిన ఆరు నెలల శిక్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి: శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడ్డ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆమె బెంగళూరు చేరుకున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని శశికళ న్యాయస్థానాన్ని కోరారు. ఇంటి భోజనం, మినరల్ వాటర్, ఏసీ, టీవీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శశికళ బెంగళూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో జయలలితతో కలసి శశికళ గతంలో ఆర్నెళ్లు పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. ఈ ఆరు నెలల శిక్షకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు శశికళ మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ కేసులో దిగువ కోర్టులో దోషిగా తేలిన జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెపై దాఖలైన అప్పీళ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. -
అమ్మపై పేల్చిన తూటా చిన్నమ్మను కూల్చింది!
-
పళనిస్వామే ఎందుకు!
తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే కొత్త శాసనసభ పక్ష నేతగా పీడబ్ల్యూడీ మంత్రి ఎడపాడి కె పళనిస్వామిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వ్యూహం ఏమిటనే ప్రశ్నకు కులం ప్రధాన కారణమనే జవాబు వినిపిస్తోంది. సొంత (తేవర్) కులానికి కాకుండా మరో పెద్ద సామాజిక వర్గానికి (గౌండర్) ప్రాధాన్యం ఇచ్చారనే ‘ఇమేజ్’ సంపాదించడానికి ఆమె ఈ పనిచేశారని భావిస్తున్నారు. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు సామాజిక వర్గాల వారు బలమైనవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. దివంగత సీఎం జయలలిత, ప్రస్తుతం ఓపీఎస్ కేబినెట్లలో తేవర్లకు 9 మంత్రి పదవులు లభించగా, గౌండర్లకు ఐదే దక్కాయి. పాలకపక్షంలో 19 మంది ఎమ్మెల్యేలున్న బీసీ వర్గమైన వన్నియార్లకు కూడా 5 పదవులే లభించాయి. 1967లో డీఎంకే, మళ్లీ 1977లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఈ రెండు ద్రవిడ పార్టీలు బ్రాహ్మణేతర సీఎంల పాలనలో ప్రధాన కులాల ఆధిపత్యం లేకుండా రాజకీయాలు నడిచాయి. 1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ ఏఐఏడీఎంకే పాలనలో తేవర్లకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణేతరులకు సామాజిక న్యాయం, తమిళానికి ప్రాధాన్యం వంటి నినాదాలతో బలమైన ద్రవిడ సైద్ధాంతిక బలం ఉన్న డీఎంకే నేత ఎం.కరుణానిధిని జయలలిత విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అనేక కులాలతో బలమైన సామాజిక సంకీర్ణం నిర్మించి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కులానికి అతీతంగా ఆమె గట్టి పునాదివర్గాన్ని పార్టీకి ఏర్పాటుచేశారు. గౌండర్లు గెలిపించారు ఓటర్లు ప్రతి అయిదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే సంప్రదాయం 1989 నుంచీ బలపడిన తమిళనాట గతేడాది (2016) అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించారు. స్వల్ప మెజారిటీతో విజయం సాధించడానికి జయలలిత వెనుక పశ్చిమ ప్రాంతం (కొంగునాడు) గట్టిగా నిలబడింది. ఈ ప్రాంతంలోని దాదాపు 50 సీట్లలో అన్నాడీఎంకే కైవసం చేసుకున్న 44 సీట్లే మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 118ని దాటి 135 స్థానాలు సాధించడానికి ఇక్కడి ఆధిపత్యవర్గమైన గౌండర్లు తోడ్పడ్డారు. నమ్మిన తేవర్ తిరుగుబాటు చేశాక గౌండర్! జయ తర్వాత ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే విషయంలో ఒక దశలో గౌండర్ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి వైపు మొగ్గుచూపారని, అదే కులానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై పేరును కూడా శశికళ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. చివరికి గతంలో జయ రెండుసార్లు తన బదులు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఓపీఎస్‌నే శశికళ ఎంపిక చేయడంతో రెండు ప్రధాన పదవులు తేవర్ల చేతుల్లోకి వచ్చాయని వాదన వినిపించింది. తాను కోరినట్టు రెండు నెలలకే రాజీనామా చేసిన ఓపీఎస్ వారం లోపే తిరుగుబాటు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ వ్యూహం మార్చారు. అసంతృప్తిగా ఉన్న గౌండర్ల మద్దతు పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నా డీఎంకే నిలుస్తుందా? దాదాపు రెండు దశాబ్దాల క్రితం(1988) ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోయింది. రెండు చీలిక వర్గాలూ ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 27 సీట్లు గెల్చుకున్న జయలలిత వర్గంలో ఎంజీఆర్ భార్య వీఎన్ జానకి నేతృత్వంలోని పార్టీ విలీనమైంది. ఎంజీఆర్ తర్వాత అంతటి జనాకర్షక నేతగా జయలలిత రుజువు చేసుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడీఎంకే మరోసారి చీలిపోతే, జయలలితలా పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ జనాదరణ సంపాదించే సత్తా ఉన్న నేతలెవరూ రెండు వర్గాల్లో లేరు. శశికళ, ఓపీఎస్, తంబిదురై, పళనిస్వామి, ఇ మధుసూదనన్.. వీరిలో ఎవరికీ అంతటి శక్తియుక్తులు లేవు. చీలిక తర్వాత రెండు వర్గాలు పూర్తిగా దెబ్బతింటే ఆ శూన్యాన్ని మరో కొత్త ద్రవిడ రాజకీయ పార్టీతో పూరించవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే రెండు చీలిక వర్గాలు, డీఎంకే మధ్య ఓట్లు చీలితే పూర్వ వైభవం సాధించవచ్చని భావించిన కాంగ్రెస్‌కు 1989 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే మరోసారి చీలితే బీజేపీకి లబ్ధిపొందే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
అమ్మపై పేల్చిన తూటా.. చిన్నమ్మను కూల్చింది!
శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి బలంగా మద్దతిస్తున్న వారిలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి కూడా ఉన్నారు. ఆమెను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ఇరవై ఏళ్ల కిందట జయలలిత లక్ష్యంగా పేల్చిన తూటా.. ఇప్పుడు శశికళను కూల్చింది. శశికళ సీఎం కలను కల్లలు చేసి మళ్లీ జైలు పాలు చేసింది. నిజానికి 1996లో జయలలిత అక్రమాస్తులపై స్వామి (అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు) ఫిర్యాదు చేసినపుడు అందులో ఆమె పేరు ఒక్కటే ఉంది. శశికళ తదితరుల పేర్లు లేవు. విచారణ కోర్టు తీర్పు ప్రకారం.. 1987లో జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ. 7.5 లక్షలు మాత్రమే. అందులో ఎక్కువ భాగం ఆమె తల్లి ఎన్ఆర్ సంధ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే ఉన్నాయి. అదనంగా రూ. 1 లక్ష నగదు ఉంది. ఆ ఏడాది ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆమె రాజకీయాల్లో పూర్తిగా క్రియాశీలకం అయ్యారు. 1991 ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చారు. కానీ 1996లో జయలలిత ఓడిపోయిన నెల రోజుల్లోనే సుబ్రమణ్యంస్వామి ఆమెపై అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ‘‘జయలలిత 1989-90 లో ప్రకటించిన ఆస్తులు ఏమీలేవు. కానీ ఆమె ముఖ్యమంత్రిగా నెలకు కేవలం 1 రూపాయి వేతనం తీసుకున్నారు. 1990-91లో ఆమె ఆస్తులు రూ. 1.89 కోట్లకు పెరిగాయి. 1991-92 నాటికి రూ. 2.60 కోట్లకు, 1992-93 నాటికి రూ. 5.82 కోట్లకు, 1993-94 నాటికి రూ. 91.33 కోట్లకు, 1994-95 నాటికి రూ. 38.21 కోట్లకు పెరిగాయి’’ అని స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 1996 డిసెంబర్లో జయలలితను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె నివాసం పొయెస్ గార్డెన్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శశికళ, ఆమె బంధువుల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి. శశికళను రెండో ముద్దాయిగా, ఆమె మేనల్లుడు వి.ఎన్.సుధాకరన్ను మూడో ముద్దాయిగా, శశికళ వదిన జె.ఇళవరసిని నాలుగో ముద్దాయిగా ఇదే కేసులో చేర్చారు. 1997 జూన్‌లో నిందితులు నలుగురిపైనా చార్జ్‌షీట్ నమోదు చేశారు. ‘‘ఆరోపిత నేరంలో ఎ2 నుంచి ఎ4 వరకూ పాలుపంచుకున్నారని దర్యాప్తు సందర్భంగా సేకరించిన సాక్ష్యాలు చెబుతున్నాయి’’ అని విచారణ కోర్టు పేర్కొంది. ఆ అభియోగాల నుంచి తమను మినహాయించాలంటూ శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు సమర్పించిన దరఖాస్తులను కోర్టు 1997 అక్టోబర్‌లో తిరస్కరించింది. ఆ ముగ్గురూ రూ. 66.65 కోట్ల అక్రమాస్తులను సంపాదించిన నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నారని, వాటిలో ఎక్కువ భాగాన్ని తమ పేర్లపై కలిగివున్నారని, వారి పేర్లపై 32 వ్యాపారాలను ప్రారంభించారని నేరాభియోగాలు నమోదు చేశారు. అలా ఇరవై ఏళ్ల కిందట జయలలితపై ప్రారంభమైన అవినీతి కేసు విచారణ ఆ తర్వాత శశికళ తదితరులను కూడా నిందితులుగా చేర్చడంతో.. అనేక మలుపుల అనంతరం, జయలలిత కన్నుమూసిన తర్వాత.. మిగతా ముగ్గురినీ జైలుకు పంపించింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి
-
ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి
చెన్నై: జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ, శశికళపై విమర్శలు చేస్తూ వస్తున్న సినీ నటి గౌతమి.. సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. శశికళ కువతూర్ నుంచి నేరుగా బెంగళూరులోని పరపణ అగ్రహార జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వేదనిలయానికి వెళ్లే నైతిక అర్హత శశికళకు లేదని ట్వీట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన సమయంలో శశికళ కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు. కోర్టు తీర్పును గౌతమి స్వాగతిస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అవినీతి కేసులో శశికళను దోషీగా నిర్ధారించారని పేర్కొంటూ, అమ్మ మృతిపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులను వేరుగా పరిగణించాలని ట్వీట్ చేశారు. జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాశారు. అమ్మకు న్యాయం చేయాలని పలు వేదికలపై డిమాండ్ చేశారు. అలాగే శశికళకకు వ్యతిరేకంగా, పన్నీరు సెల్వంకు మద్దతుగా గౌతమి గళం విప్పారు. శశికళ ఇదే కేసులో గతంలో పరపణ అగ్రహార జైల్లో 6 నెలలు ఉన్నారు. #sasikala has direct route from #koovathur to #ParapanaAgrahara She has NO moral right to #VedaNilayam #JusticeForAmma — Gautami (@gautamitads) 14 February 2017 #sasikala has been convicted for corruption. She has to answer for #Amma death also Both cases don't carry equal sentencing #JusticeForAmma — Gautami (@gautamitads) 14 February 2017 శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇచ్చినా లేదా అన్నా డీఎంకే శాసన సభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఎన్నికైన పళనిస్వామిని ఆహ్వానించినా.. సభలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేకిత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే.. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 235. వీరిలో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కాగా 234 మంది నేరుగా ఎన్నికైన వారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 మంది, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నారు. మెజార్టీ మార్క్ 117 సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకేకు మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది పన్నీరు సెల్వంకు మద్దతు ఇస్తారు? ఎంతమంది పళనిస్వామి వెంట నిలుస్తారు? అన్నది తేలాల్సివుంది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 225 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గంలో అంటే పళనిస్వామికి మద్దతుగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. అన్నాడీఎంకే తమకు ప్రత్యిర్థి పార్టీ అని, తాము మద్దతు ఇవ్వబోమని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీదీ ఇదే వైఖరి. ఏం జరగకవచ్చు..? ఈ నేపథ్యంలో మెజార్టీ మార్క్ 117 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంట నిలుస్తారా లేదా పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ వైపు వస్తారని చెబుతున్న పన్నీరు సెల్వం వర్గీయుల మాట నిజమవుతుందా లేదా త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన స్టాలిన్ అన్నంతపనీ చేస్తారా లేదా ఎవరూ మెజార్టీ నిరూపించుకోని పక్షంలో రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ అరెస్ట్‌పై సందిగ్ధత
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించిన శశికళను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా శశికళను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆమె కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉంటున్నారు. తమిళనాడు పోలీసులు శశికళను అరెస్ట్ చేసి ఈ రోజు రాత్రికి చెన్నైలో ఉంచి.. రేపు (బుధవారం) బెంగళూరుకు తరలించి కర్ణాటక పోలీసులకు అప్పగించే అవకాశముందని వార్తలు వచ్చాయి. రేపు బెంగళూరు కోర్టులో ఆమెను హాజరు పరచనున్నట్టు సమాచారం. శశికళను అరెస్ట్ చేసే విషయంలో తమిళనాడు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా శశికళ ఇవాళ పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం లేదని లాయర్లు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీ అందలేని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు. కోర్టులో లొంగిపోయేందుకు తనకు కొంత సమయం కావాలని శశికళ కోరే అవకాశముందని భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాలు గడువు కావాలని పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఎవరీ పళనిస్వామి..?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలుశిక్ష పడటంతో ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు ఈ విషయం తెలియజేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. పళనిస్వామి గురించి తెలుసుకోవాలంటే.. పన్నీరు సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ.. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించినట్టు సమాచారం. అయితే అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పళనిస్వామి చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
-
గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
-
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
చెన్నై: శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు ర్యాలీగా గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లారు. రిసార్ట్ బయటే సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్‌లో శశికళతో పాటు ఆమె వర్గం ఎమ్మెల్యేలు, అన్నా డీఎంకే పార్టీ నేతలు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. రిసార్ట్ బయట పన్నీరు సెల్వం వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా.. లోపల ఉన్న ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లబోమని చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. పన్నీరు సెల్వం వర్గీయులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
న్యూఢిల్లీ: అన్నా డీఎంకేలో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత విషయమని, తమిళనాడు పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయ తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. జైట్లీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకుండా పోయింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
చిన్నమ్మ శశికళకు మరో షాక్!
చెన్నై : అమ్మ తర్వాత అమ్మగా అన్నాడీఎంకే సారథ్య బాధ్యతలు చేపట్టిన శశికళకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చిన్నమ్మగా గుర్తింపు తెచ్చుకోవాలని శశికళ చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు ఆర్కే నగర్ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే మాజీ మంత్రి టీటీవీడీ దినకరన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్‌కు ఈడీ రూ.28 కోట్ల జరిమానా విధించినట్టు మద్రాసు హైకోర్టు శుక్రవారం ధృవీకరించింది. జయలలిత మృతితో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ, అమ్మ పోటీచేసే ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆర్కే నగర్ వాసులు మాత్రం శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓట్లు అడగడానికి తమ వద్దకు రావద్దని, అమ్మ కోసమే తాము ఇక్కడ ఉంటున్నామంటూ చెబుతున్నారు. ఆ పార్టీలోనూ కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా శశికళ ఎప్పటికీ తమిళనాడుకు చిన్నమ్మ కాలేరని తేల్చిచెబుతున్నారు. మరోవైపు నుంచి జయలలిత వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె మేనకోడలు దీపా జయకుమార్ తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఆర్కే నగర్ వాసుల నుంచి దీపా జయకుమార్‌కు మద్దతు లభిస్తోంది. దీపా మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలని ఆర్కే నగర్ వాసులు కోరుతున్నారు.