శశికళ అరెస్ట్‌పై సందిగ్ధత | Tamilnadu police may arrest VKSasikala | Sakshi
Sakshi News home page

శశికళ అరెస్ట్‌పై సందిగ్ధత

Published Tue, Feb 14 2017 4:28 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

Tamilnadu police may arrest VKSasikala

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించిన శశికళను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా శశికళను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆమె కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉంటున్నారు.

తమిళనాడు పోలీసులు శశికళను అరెస్ట్ చేసి ఈ రోజు రాత్రికి చెన్నైలో ఉంచి.. రేపు (బుధవారం) బెంగళూరుకు తరలించి కర్ణాటక పోలీసులకు అప్పగించే అవకాశముందని వార్తలు వచ్చాయి. రేపు బెంగళూరు కోర్టులో ఆమెను హాజరు పరచనున్నట్టు సమాచారం. శశికళను అరెస్ట్ చేసే విషయంలో తమిళనాడు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కాగా శశికళ ఇవాళ పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం లేదని లాయర్లు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీ అందలేని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు. కోర్టులో లొంగిపోయేందుకు తనకు కొంత సమయం కావాలని శశికళ కోరే అవకాశముందని భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాలు గడువు కావాలని పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది.

శశికళ కేసు.. మరిన్ని కథనాలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement