DA case
-
కేసుల నమోదులో ఏసీబీ డీలా!
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన ఏసీబీ వెనక్కి తగ్గిందా? కేవలం లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన పెద్ద చేపలను ఊచల్లోకి నెట్టాల్సిన అవినీతి నిరోధక శాఖ ఎందుకు సైలెంట్ అయ్యింది? ఏడాదిలో కనీసం ఒక్క అవినీతి అధికారిపై కూడా డీఏ (డిస్ప్రొపార్సినేట్ అస్సెట్స్) కేసు నమోదు చేయకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? నిజంగానే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులు లేరని ఏసీబీ భావిస్తోందా? లేక అలాంటి అధికారులపై ఫిర్యాదు రాకపోవడం వల్ల కేసులు నమోదు చేయడం లేదా? ఈ ప్రశ్నలు, అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఉన్న ఊపేది... తెలంగాణ ఏర్పడిన కొత్తలో పలు సంచలనాత్మక కేసులను డీల్ చేసిన అవినీతి నిరోధక శాఖ నెమ్మదించినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో ఏసీబీ విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఈఎస్ఐ స్కాంలో వందల కోట్లు నొక్కేసిన వ్యవహారంలో ఉద్యోగులతో పాటు పలు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న వ్యవహారంలో రాష్ట్ర స్థాయి హోదా ఉన్న అధికారులను ఊచలు లెక్కబెట్టేలా దూకుడుతో వ్యవహరించింది. అంతటి ఏసీబీ ఇప్పుడు పెద్దగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కేవలం ట్రాప్ కేసులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఏసీబీ, ఒక్క ఆదాయానికి మించిన కేసు గానీ, నిధుల దుర్వినియోగంతో సొమ్ము చేసుకున్న కేసులు గానీ నమోదు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 63 ట్రాప్ కేసులు మాత్రమే ఏసీబీ నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రెవెన్యూ, పోలీస్ శాఖలే ప్రధానంగా ఉన్నాయి. గతేడాది పది వరకు డీఏ కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనేక ఆరోపణలకు తావిస్తోంది. కీసర నాగరాజు వ్యవహారమే కారణమా? గతేడాది ఆగస్టులో రాంపల్లి భూముల వ్యవహారంలో కీసర ఎమ్మార్వో రూ. కోటి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజుతో పాటు సర్పంచ్ అంజిరెడ్డి, వరంగల్‌కు చెందిన రియల్టర్ శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఓ సాయిరాజులను అరెస్ట్ చేసింది. అదే ఎమ్మార్వోపై రోజుల వ్యవధిలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగానే అక్టోబర్ 14న ఎమ్మార్వో నాగరాజు చంచల్‌గూడ జైళ్లో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసు మరింత హీటెక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి అనే వ్యక్తి నవంబర్ 8న కుషాయిగూడలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం దుమారానికి తెరదీసింది. ఒక్క కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో నిందితుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో ఏసీబీ కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నుంచి సైతం ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి అవినీతి తిమింగళాల వేటకు ఏసీబీ స్పీడ్ బ్రేకర్ వేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రాసిక్యూషన్ అనుమతి కూడా కారణమేనా? ఏసీబీ కేసుల్లో నిందితుల విచారణకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాకపోవడం కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేయకపోవడానికి ప్రధాన కారణమని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన వేలాది కేసుల్లో కనీసం పదుల సంఖ్యలో కూడా నిందితుల విచారణ కోసం ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాలేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
-
షాకిచ్చిన కోర్టు.. ఇక ఆ సీఎం అరెస్టేనా!
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన సతీమణికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వారు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, 2015, అక్టోబర్ 1లో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్వరులను కూడా జస్టిస్ విపిన్ సంఘి ఎత్తివేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గతంలో వీరభద్రసింగ్‌ను కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడంగానీ, విచారణ చేయడంగానీ, చార్జీషీట్ నమోదుకానీ చేయరాదు. తాజాగా ఆ ఉత్తర్వులు కూడా లేకుండా పోవడంతో ఇక సీబీఐ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. 2015 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసు వీరభద్ర సింగ్‌పై నమోదైంది. -
జయలలితకు మూడుసార్లు మొక్కి..
-
శశికళకు సుప్రీంకోర్టులో మరో షాక్
-
శశికళ అరెస్ట్‌పై సందిగ్ధత
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించిన శశికళను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా శశికళను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆమె కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉంటున్నారు. తమిళనాడు పోలీసులు శశికళను అరెస్ట్ చేసి ఈ రోజు రాత్రికి చెన్నైలో ఉంచి.. రేపు (బుధవారం) బెంగళూరుకు తరలించి కర్ణాటక పోలీసులకు అప్పగించే అవకాశముందని వార్తలు వచ్చాయి. రేపు బెంగళూరు కోర్టులో ఆమెను హాజరు పరచనున్నట్టు సమాచారం. శశికళను అరెస్ట్ చేసే విషయంలో తమిళనాడు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా శశికళ ఇవాళ పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం లేదని లాయర్లు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు కాపీ అందలేని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు. కోర్టులో లొంగిపోయేందుకు తనకు కొంత సమయం కావాలని శశికళ కోరే అవకాశముందని భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాలు గడువు కావాలని పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే...
-
మూడు నిమిషాల్లో మారిన తలరాత
-
జయ నుంచి జైలు దాకా శశి పయనం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత కొద్ది రోజులపాటు మౌనంగా ఉన్న ఆమె నిచ్చెలి శశికళ చేతికి అనూహ్యంగా అన్నాడీఎంకే పార్టీ పగ్గాలొచ్చాయి. ఆ వెంటనే పార్టీ పగ్గాలు, అధికారం ఒక్కరికే ఉండాలనే పార్టీ సంప్రదాయాన్ని ముందుకు తెచ్చి ఆ మేరకు ముందడుగు వేశారు. అందులో భాగంగానే ఆమె శాసనభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇక ముఖ్యమంత్రి పదవి నుంచి పన్నీర్ సెల్వం తప్పుకున్నారు. అయితే, అలా తప్పుకున్న ఆయన నేరుగా తనకు అండగా నిలుస్తారని శశికళ భావించి ఉండొచ్చు.. లేదంటే ఎమ్మెల్యేల సహాయంతో సెల్వాన్ని ఎదుర్కోవచ్చని ఎత్తుగడలు కూడా వేసి ఉండొచ్చు. కానీ, తాను వెళుతుంటే ఆ బాటంతే పూలబాటే అవుతుందని ఎవరో అదృష్టవంతుడు అనుకున్నట్లు పన్నీర్ సెల్వానికి అనూహ్యంగా కలిసొచ్చిన అంశం మాత్రం శశికళపై అక్రమాస్తుల కేసు. ఈ కేసు తొలుత బయటకు రానప్పటికీ ఆయన శశికళకు ఎదురు తిరిగిన తర్వాత బాగా వినిపించడం కాస్తంత గమనించాల్సి ఉంటుంది. అమ్మ సెంటిమెంటు ఆయుధంగా చేసుకున్న సౌమ్యుడు సెల్వం ఆమె సమాధి వద్దకు వెళ్లి శశికళపై బాంబులమీద బాంబులు పేల్చారు. తనను బలవంతంగా దించారని, అమ్మ మరణంపై అనుమానం ఉందని, ఆమె నేరస్తురాలని ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రజలు కోరితే పదవి చేపడతా అంటూ దాడి మొదలుపెట్టారు. దీంతో శశికళ దృష్టి అంతా కూడా పన్నీర్‌ను ఎదుర్కోవడంపైనే పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటికీగానీ అసలు యుద్ధం మొదలుకాలేదు.. ఈలోగా అనూహ్యంగా గత ఏడాది ఎప్పుడో జూలై నెలలో అక్రమాస్తుల కేసుపై తదుపరి విచారణ తేదిని ప్రకటించకుండానే పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఒక్కసారిగా వార్నింగ్ బెల్ కొట్టింది. అయితే, రాష్ట్ర రాజకీయంపైనే దృష్టి పెట్టిన శశికళ ఈ కేసే తన కొంపముంచనుందని అంచనా వేయలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందన్న ఆశాభావంతోనే శశికళ ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఇటు సెల్వం వ్యూహాల విషయంపక్కన పెడితే అక్రమాస్తుల కేసు వచ్చిపడి అమాంతం శశికళ ఆశలను ఒక్కసారిగా ఆవిరి చేసింది. దీంతో ఇప్పుడు ఆమె నాలుగేళ్లపాటు గతంలో ఆరు నెలలు పూర్తి చేసిన ఆమె మరో మూడున్నరేళ్లు జైలులో ఉండాల్సి ఉంటుంది. అనంతరం మరో ఆరేళ్లపాటు ఏ రాజకీయ పదవికి అర్హురాలు కారు.. పోటీ కూడా చేయరాదు. ఇలా జయవెంటే మొదలైన ఆమె ప్రస్థానం నేటి జైలు వరకు ఎలా కదులుతూ వచ్చిందో సంక్షిప్తంగా గమనిస్తే.. జయతో శశికళ ప్రస్థానం.. తమిళనాడులోని మన్నారుగుడికి చెందిన శశికళకు జయలలితకు 1976లో స్నేహం కుదిరింది. అప్పుడు జయ సినిమాల్లో విజయవంతంగా ఉండంటంతోపాటు రాజకీయాల్లో ఎదగడం మొదలుపెట్టారు. సొంతంగా వీడియో పార్లర్ కలిగిన శశికళ జయలలిత రాజకీయ కార్యక్రమాలు, జయలలిత స్పీచ్‌లు రికార్డింగ్‌లు చేసేవారు. ఆ తర్వాత జయతో కలిసి ఆమె ఎక్కడికి వెళ్లినా తోడుగా వెళ్లడం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం చేసేవారు. 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయిన సమయంలో జయకు రాజకీయంగా బలంగా మద్దతిచ్చిన వారిలో శశికళ కూడా ఒకరు. తర్వాత జయతోపాటు ఆమె పోయెస్ గార్డెన్‌ను, నివాస సంరక్షణ బాధ్యతలు చూసేందుకు శశికళ వెళ్లగా ఆమె మేనళ్లుడు సుధాకరణ్ కూడా వెళ్లాడు. అతడే తర్వాత పెంపుడు కొడుకుగా మారాడు 1996లో సుధాకరన్ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడంతో అసలు వివాదం మొదలైంది. పెద్ద మొత్తంలో అక్రమ సంపాధనతో జయ ఈ వివాహం చేశారని ఆమెపై అసెంబ్లీలో రచ్చరచ్చ అయింది. ఈపరిణామాల తర్వాత శశికళ అరెస్టయింది. దీంతో వారిని కొద్ది రోజులపాటు జయ దూరగా పెట్టారు. 2011లో శశికళను పూర్తిగా పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత బయటకు గెంటేశారు. మన్నారుగుడి వర్గంతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా కుట్రలకు దిగారనే అనుమానంతో శశిని, జయ బంధువులను, విశ్వసనీయులను దూరంగా పెట్టారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత శశికళ పోయెస్ గార్డెన్‌కు తన భర్తను, బంధువులను వదిలేసి జయలలిత వద్దకు చేరారు. గత ఏడాది 2016 డిసెంబర్ 5న జయలలిత చనిపోవడంతో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యారు. చివరకు నేడు (ఫిబ్రవరి 14)న సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఎత్తులు మీద పై ఎత్తులు వేసిన శశికళను ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం పన్నీర్ సెల్వం, డీఎంకే శ్రేణుల్లేనే కాదు, ఇటు సోషల్ మీడియాను సంబురాల్లో ముంచెత్తింది. న్యాయానికి తమిళనాడులో కనీస గ్యారెంటీ ఉందని కుష్భు సుందరన్ ట్వీట్ చేయగా.. తమిళ ప్రజలకు సుప్రీంకోర్టు బెస్ట్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చిందని మరొకరు ట్వీట్ చేశారు. ఎలాంటి భయాందోళన లేకుండా ఇక ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శాంతిస్తుందని ప్రముఖ నటి గౌతమి ట్వీట్ చేశారు. అమ్మ మరణం గురించి శశికళ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసుల్లో ఆమెకు వేర్వేరుగా శిక్షలు విధించాలని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో జడ్జ్మెంట్ రాసిన స్పెషల్ కోర్టు జడ్జ్‌ను రియల్ హీరోగా తమిళ నెటిజన్లు పొగుడుతున్నారు. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ముందు నుంచి శశికళను వ్యతిరేకిస్తున్న ట్విట్టర్ యూజర్లు, తీర్పు వెలువడిన వెంటనే ఫుల్‌గా ఛలోక్తులు పేల్చారు. డియర్ శశికళ... హ్యాపీ వాలెంటైన్స్ డే, లవ్, సుప్రీంకోర్టు అని, శశికళకు చివరికి సెంట్రల్ జైలులో పీఠం దొరికిందంటూ యూజర్లు పలు కామెంట్లు చేశారు. Sasikala has finally won the chair in Central Jail :) #OPSvsSasikala #OPSWINS — Adith Nataraj (@Adithnatraj) February 14, 2017 The best valentine gift to the people of TN by the #SC..people can breathe normally n live without any fear .. — khushbusundar (@khushsundar) February 14, 2017 #sasikala has been convicted for corruption. She has to answer for #Amma death also Both cases don't carry equal sentencing #JusticeForAmma — Gautami (@gautamitads) February 14, 2017 Real hero in DA case is JohnMichaelCunha, special court judge who wrote a brilliant judgement. K'taka HC cuts a sorry face. #Sasikala #Jaya — Sugata (@sugataraju) February 14, 2017 శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
మూడు నిమిషాల్లో మారిన తలరాత
అది మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్ ప్రాంతంలో గల గోల్డెన్ బే రిసార్ట్ ప్రాంతం. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయం. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్నమ్మ శశికళ కూడా అక్కడే ఉన్నారు. సోమవారం సాయంత్రమే ఆమె అక్కడకు చేరుకున్నారు. అటు ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో కూడా ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు, ఇతరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏ క్షణంలోనైనా తీర్పు రావచ్చని ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని ఆరో నెంబరు కోర్టులో జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్ ఇద్దరూ తమ తమ స్థానాల్లోకి చేరుకున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన చేతుల్లో ఉన్న సీల్డ్ కవర్ విప్పారు. ఇది సంక్లిష్టమైన అంశమే అయినా తీర్పు ఇస్తున్నామని చెప్పారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెట్టేశారు. శశికళ సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న సుధాకరన్, ఇళవరసి అంతా దోషులేనని, నాలుగు సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పట్టింది రెండు మూడు నిమిషాలు మాత్రమే. ఈ కొద్ది సమయంలోనే శశికళ తలరాత మొత్తం తలకిందులైంది. తీర్పు తనకు అనుకూలంగా వస్తే గవర్నర్ ఏ క్షణంలోనైనా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి పిలవచ్చని ఆశించిన ఆమె.. సోమవారం కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా ధీమాగా కనిపించారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది తాను మాత్రమేనని, పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది కూడా తానేనని చెప్పారు. కానీ, తీర్పు వచ్చిన వెంటనే ఆమె ఆశలు అడియాసలయ్యాయి. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు'
-
తీర్పుపై మురళీధర్ రావు స్పందన
-
‘బీజేపీకి సంబంధం లేదు’
ఢిల్లీ: తమిళనాడులో జరుగుతున్న సంక్షోభానికి, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు తెలిపారు. శశికళ నటరాజన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు క్లీన్ పాలిటిక్స్ దిశగా గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా సర్వోన్నత న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అదేవిధంగా శశికళకు రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ నేపధ్యంలో వారం రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. -
శశికళకు నాలుగేళ్ల శిక్ష కానీ..
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ2గా ఉన్న వీకే శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆమె వాస్తవంగా అనుభవించాల్సింది మాత్రం మూడున్నరేళ్లు మాత్రమే. ఎందుకంటే, ఇంతకుముందు దిగువకోర్టులో తీర్పు వచ్చినప్పుడు జయలలిత, శశికళ సహా మొత్తం నలుగురు దోషులు ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. అప్పట్లో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో వాళ్లు శిక్ష అనుభవించారు. దాంతో ఆ శిక్షా కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను మాత్రమే శశికళ, సుధాకరన్, ఇళవరసి.. ఈ ముగ్గురూ అనుభవించాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ కేసులోనైనా దిగువ కోర్టులు తీర్పు ఇచ్చినప్పుడు శిక్ష అనుభవిస్తూ పైకోర్టులో అప్పీలుకు వెళ్తే, అక్కడ స్టే లేదా బెయిల్ వచ్చేవరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు పైకోర్టులో నిందితులకు అనుకూలంగా తీర్పు వస్తే.. పూర్తిగా విడుదల కావడం, లేనిపక్షంలో అంతకుముందు అనుభవించిన శిక్షాకాలం మినహాయించి మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు శశికళ విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకుముందు ఆమె అనుభవించిన ఆరునెలల కాలాన్ని మినహాయించి మిగిలిన మూడున్నరేళ్ల శిక్ష ఇప్పుడు అనుభవించాలి. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
జయలలిత ఉండి ఉంటే...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా దోషిగానే సుప్రీంకోర్టు తీర్పుతో తేలినట్లయింది. కేసులో ఎ1 జయలలిత, ఎ2 వీకే శశికళ, ఎ3 సుధాకరన్, ఎ4 ఇళవరసి.. ఇలా ఈ నలుగురూ కూడా అక్రమాస్తుల కేసులో దోషులుగానే సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైంది. వాస్తవానికి ఆమె ప్రస్తుతం జీవించి ఉండకపోవడంతో ఆమెకు ఎలాంటి శిక్ష, జరిమానా పడే అవకాశం లేదుగానీ, మిగిలిన అందరికీ శిక్ష పడింది. అందులో ప్రధానంగా జయలలితకు ముందు నుంచి వెన్నంటి ఉన్న వీకే శశికళ ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. మొత్తం తీర్పు వెల్లడించే ప్రక్రియ కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే జరిగింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందుగా సీల్డ్ కవర్ తెరిచి, ఇది సంక్లిష్టమైన అంశమే అయినా తీర్పు ఇస్తున్నామని చెప్పారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. శశికళ వెంటనే లొంగిపోవాలని అన్నారు. పది కోట్ల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత తనతో పాటు ఈ కేసును విచారించిన అమితవ్ రాయ్ కూడా తీర్పు చెబుతారని అన్నారు. అవినీతి విషయంలో కఠినాతి కఠినంగా వ్యవహరించాలని జస్టిస్ అమితవ్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చేయడంతో.. దాన్ని సవాలు చేయాలంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదు. -
శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు
-
శశికళ దోషి: సుప్రీంకోర్టు తీర్పు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. పన్నీర్ సెల్వానికి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు భావించాలి. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్లయింది. ఏ నేరంలోనైనా శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉండటంతో.. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పూర్తిగా పోయాయి. -
రేపు తేలనున్న శశికళ భవితవ్యం!
-
రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం!
న్యూఢిల్లీ: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలనుంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఒకవేళ శశికళకు శిక్షపడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఆవిరైనట్టే. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ కొన్ని రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఈ తీర్పును సవాల్ చేస్తూ జయలలిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయడంతో జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. కాగా హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై తమిళనాట ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు
-
శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు
సోమవారం తీర్పుల జాబితాలో చేర్చని సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: సర్వత్రా ఆసక్తిగా నెలకొన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టు సోమవారం కూడా వెలువరించడంలేదు. ఆరోజు కేసుల జాబితాలో దీనిని చేర్చలేదు. ఈ కేసులో తీర్పుపైనే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. జయ అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నారు. అయితే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం.. వారంలో తీర్పు వెలువరిస్తామని ఈనెల 6న చెప్పిన నేపథ్యంలో ఈ వారంలోనే తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో శశికళ బంధువులు వీఎన్ సుధాకరన్, ఇళవరసి కూడా నింధితులుగా ఉన్నారు. కాగా, శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈనెల 17 సుప్రీం కోర్టు చేపట్టనుంది. అమ్మ మిత్రుల మద్దతు పన్నీర్‌కే! సాక్షి, చెన్నై: సీఎం పదవికి అన్నాడీఎంకేలో ఎవరు అర్హులో అన్న విషయంలో తమ మద్దతు పన్నీరుకేనని జయలలిత స్కూల్‌మేట్స్ ప్రకటించారు. జయలలితతో కలిసి చెన్నై చర్చ్‌పార్కు స్కూల్లో చదువుకున్న మిత్రులు ముగ్గురు శనివారం ఓ మీడియాతో మాట్లాడారు. శ్రీమతి అయ్యంగార్ మాట్లాడుతూ 1980 వరకు జయలలితతో తాను మాట్లాడినట్లు చెప్పారు. శశికళ రాకతో జయలలితకు దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వారసుడ్ని జయలలిత ముందుగానే ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే, జయలలిత మదిలో తప్పకుండా పన్నీర్‌సెల్వంకు మంచి గుర్తింపు, స్థానం ఉందని తెలిపారు. శశికళ కంటే, పన్నీర్‌సెల్వం ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం ఉందని, అందుకే తన మద్దతు ఆయనకేనని స్పష్టం చేశారు. తాను ఓ ట్రావెల్స్ సంస్థను నడుపుతున్నట్టు మరో స్నేహితురాలు శాంతిని పంకజ్ చెప్పారు. తన పిల్లలంటే జయకు ఎంతో ఇష్టమని, తన కోసం మూడుసార్లు ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. 2005 వరకు జయలలిత సన్నిహిత సంబంధాలు కొనసాగినట్టు వివరించారు. తదుపరి శశికళ వల్ల జయకు దూరం కావాల్సివచ్చిందని, ఆ తర్వాత పన్నీర్ సెల్వం ద్వారా ఓ సారి జయలలితను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. శశికళ రూపంలో పార్టీకి మంచి జరుగుతుందో ఏమోగానీ, ప్రజలకు మంచి జరగాలంటే, పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. జయలలితకు నమ్మకస్తుడు పన్నీర్ సెల్వం అని, సీఎం పదవికి అర్హుల విషయంలో తన మద్దతు ఆయనకే అని పదర్ సయ్యద్ అనే మిత్రుడు స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే పన్నీర్‌కు మద్దతు: స్పష్టం చేసిన మంత్రి పాండియరాజన్ సాక్షి, చెన్నై : ప్రజాభీష్టం మేరకు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌కు మద్దతు ప్రకటించినట్టు విద్యాశాఖ మంత్రి పాండియరాజన్ తెలిపారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్ సెల్వం నివాసానికి చేరుకుని శనివారం ఉదయం మద్దతు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పన్నీర్‌కు మద్దతుగా నిలవాలని తన నియోజకవర్గ ప్రజల నుంచి ఏడువేల మెసేజ్‌లు అందాయని చెప్పారు. ప్రజాభీష్టం మేరకే పన్నీర్‌కు మద్దతివ్వడానికి ముందుకు వచ్చానని తెలిపారు. అమ్మ జయలలిత నమ్మిన బంటుగా, విశ్వాసానికి ప్రతిరూపంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పార్టీని చీల్చడం ఎవరి తరం కాదని, శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తప్పకుండా పన్నీర్‌కు మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. శశికళ సీఎం కావడం అసాధ్యమని తెలిపారు. సీబీఐ విచారణకు పట్టు: ఎంపీలు అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందని, దీనిపై సీబీఐ విచారణ తప్పనిసరి అని అన్నాడీఎంకే ఎంపీలు సుందరం, అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. నామక్కల్ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది ఆరంభం మాత్రమేనని, తంబిదురై తప్ప, మిగిలిన ఎంపీలందరూ పన్నీర్‌కు మద్దతు ప్రకటించేందుకు ఇక్కడికి రాబోతున్నారని ప్రకటించారు. తమ అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందని, దీనిపై సీబీఐ విచారణ సాగించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అడ్డదారిలో సీఎం పదవిలోకి రావాలని శశికళ ప్రయత్నించారన్నారు. ఆమె పన్నాగాలను పన్నీర్ తిప్పికొట్టడం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నర్సు డాక్టర్ అయ్యేందుకు వీలుందా? ఆయమ్మ సీఎం అయ్యేందుకు ఏ అర్హతలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజలు కోరుకుంటున్నారు: పొన్నయ్యన్ పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకేకు మంచి భవిష్యత్తు ఉందని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయ్యన్ చెప్పారు. ప్రజలందరూ ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. అనుభవజ్ఞుడు, రెండుసార్లు సీఎంగా పనిచేసిన పన్నీర్ సెల్వం సమర్థవంతంగా రాణిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పురట్చి తలైవర్, తలైవి మార్గంలో అన్నాడీఎంకే బలోపేతం పన్నీర్ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఆయనకు కోటిన్నర మంది కార్యకర్తలు మద్దతు ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక శిబిరాల్లో ఉన్న వాళ్లందరూ తప్పకుండా పన్నీర్‌కు మద్దతుగా ముందుకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. శాశ్వత సీఎం పన్నీర్: ఎంపీ సత్యభామ అమ్మ జయలలిత ఆశయ సాధన పన్నీర్ ద్వారానే సాధ్యం అవుతుందని తిరుప్పూర్ ఎంపీ సత్యభామ చెప్పారు. విధేయతకు ప్రతీరూపంగా ఉన్న పన్నీర్‌కు అమ్మ రెండుసార్లు సీఎం పదవి అప్పగించారని గుర్తు చేస్తూ, అన్నాడీఎంకేకు ఇక శాశ్వత సీఎం ఆయనేనని ధీమా వ్యక్తం చేశారు. -
సీఎం కొడుకును ప్రశ్నించిన సీబీఐ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను సీబీఐ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు విక్రమాదిత్య ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ కేసులో వీరభద్రసింగ్ పిల్లలు విక్రమాదిత్య, అపరాజితా కుమారిలను సాక్షులుగా పిలిచినట్లు ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ సోమవారమే తెలిపింది. అయితే.. సీబీఐ తమను పిలిచిన తర్వాత అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వాళ్లిద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమ తల్లిదండ్రులతో పాటు వేరేవారిని కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు గానీ తమ పేర్లు ఎక్కడా లేవని తెలిపారు. తాము విచారణకు సహకరిస్తాము గానీ, సీబీఐ తమను అరెస్టు చేస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంటు ఆనంద్ చౌహాన్ తదితరులపై గత సంవత్సరం సెప్టెంబర్ 23న అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైంది. ప్రాథమిక విచారణ అనంతరం వీరభద్రసింగ్ రూ. 6.03 కోట్ల సంపద మూటగట్టుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. 81 ఏళ్ల సింగ్ ను ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు సహకరించకపోవడం, ఆస్తుల గురించిన సమాచారం ఏదీ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆయన పిల్లల వంతు వచ్చింది. -
ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం
సిమ్లా: అక్రమ ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్య, పిల్లల పేరుతో ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులు, భాగస్వాములు కుట్రలు చేసి ఏవిధంగా ఆస్తులు సంపాదించారనే దానిపై సీబీఐ వద్ద సాక్ష్యాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీరభద్ర సింగ్ ను గురువారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించాననో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నవారందిరినీ త్వరలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. -
జయ అక్రమాస్తుల కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలితపై అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లు సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ గతేడాది ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..జయకు ఊరట లభించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
కొత్త చిక్కుల్లో జయ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మరో ఎదురుదెబ్బ తగలింది. అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు సీఎంను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సుప్రీంలో విచారణ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఈ షాక్‌తో జయలలితకు కొత్త చిక్కులు ప్రారంభం అయినట్లే కనిపిస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల కేసులో జయలలితను నిర్దోషిగా నిర్ణయిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 2 నుంచి విచారణ జరపాలని నిర్ణయించింది. జయ అక్రమ ఆస్తుల కేసులో సుదీర్ఘకాలం పాటు విచారణ ఎదుర్కొని ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. కర్ణాటక హైకోర్టు జయలలితకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం నిర్ణయం పురుచ్చిత్తలైవికి ఒకింత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది. -
'జయ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై సుప్రీంకు'
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే నేత అన్బగళన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో వాస్తవం లేదంటూ... ఆయన గురువారం సుప్రీంలో పిటిషన్ వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని అన్బగళన్ వేసిన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
జడ్జిమెంట్ డే...
-
ఆస్తుల కేసు దర్యాప్తుపై డిజిపి వివరణ