
'జయ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై సుప్రీంకు'
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే నేత అన్బగళన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో వాస్తవం లేదంటూ... ఆయన గురువారం సుప్రీంలో పిటిషన్ వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని అన్బగళన్ వేసిన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.