కొత్త చిక్కుల్లో జయ
కొత్త చిక్కుల్లో జయ
Published Fri, Jan 8 2016 1:43 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మరో ఎదురుదెబ్బ తగలింది. అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు సీఎంను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సుప్రీంలో విచారణ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఈ షాక్తో జయలలితకు కొత్త చిక్కులు ప్రారంభం అయినట్లే కనిపిస్తోంది.
ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల కేసులో జయలలితను నిర్దోషిగా నిర్ణయిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 2 నుంచి విచారణ జరపాలని నిర్ణయించింది. జయ అక్రమ ఆస్తుల కేసులో సుదీర్ఘకాలం పాటు విచారణ ఎదుర్కొని ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. కర్ణాటక హైకోర్టు జయలలితకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం నిర్ణయం పురుచ్చిత్తలైవికి ఒకింత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది.
Advertisement