జయ అక్రమాస్తుల కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలితపై అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
18 ఏళ్లు సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ గతేడాది ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..జయకు ఊరట లభించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.