తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఎత్తులు మీద పై ఎత్తులు వేసిన శశికళను ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం పన్నీర్ సెల్వం, డీఎంకే శ్రేణుల్లేనే కాదు, ఇటు సోషల్ మీడియాను సంబురాల్లో ముంచెత్తింది. న్యాయానికి తమిళనాడులో కనీస గ్యారెంటీ ఉందని కుష్భు సుందరన్ ట్వీట్ చేయగా.. తమిళ ప్రజలకు సుప్రీంకోర్టు బెస్ట్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చిందని మరొకరు ట్వీట్ చేశారు. ఎలాంటి భయాందోళన లేకుండా ఇక ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శాంతిస్తుందని ప్రముఖ నటి గౌతమి ట్వీట్ చేశారు.