ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడ్డ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆమె బెంగళూరు చేరుకున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని శశికళ న్యాయస్థానాన్ని కోరారు. ఇంటి భోజనం, మినరల్ వాటర్, ఏసీ, టీవీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.