గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు.
నిన్న బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు.
శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
చెన్నైకు చిన్నమ్మ?
విజేత పళని
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు