dmk leaders
-
IT, ED: నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు చెందిన కొందరు నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నుల శాఖ దాడులు కొనసాగిస్తోంది. చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలకు దిగింది. డీఎంకే బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డీఎంకే నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డీఎంకేలో పని చేసిన సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అరెస్ట్ తర్వాత డీఎంకే అతన్ని పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు సినీ పరిశ్రమలో, వ్యాపార వర్గాల్లో సాదిక్‌తో పరిచయాలు ఉన్నవారిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర దర్శకుడు, నటుడు అమీర్‌తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇటీవలె ఢిల్లీలో విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శన నటుడు అమీర్ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ తీసిన మూడు చిత్రాల్లోనూ సాదిక్ నిర్వాణ భాగస్వామ్యం ఉండడం గమనార్హం. అలాగే పలువురు డీఎంకే ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్సీబీ నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్ఐఆర్లను పరిగణలోకి తీసుకుని సాదిక్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రూ.32 కోట్లు స్వాధీనం మరోవైపు.. తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్ పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అరుల్‌మురుగన్, శరవణ మురుగన్, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
రాజ్యసభ సభ్యుడు అరెస్ట్
చెన్నై: డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి(73)ని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దళిత సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అలందూర్‌లోని ఆయన నివాసంలో ఆర్ఎస్ భారతిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలైంజర్ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎస్సీలను కించేపరిచే విధంగా ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయనను రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం తనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ‘అవినీతి కేసులో డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంపై నిన్న ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్‌ను సుమారు 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంలో అక్రమాల గురించి ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధమవుతున్నాము. మీరు దువ్వెనను దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు. నేను జైలులో ఉన్నప్పటికీ, మా న్యాయవాదుల బృందం ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంద’ని అన్నారు. కాగా, భారతికి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఫిబ్రవరిలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆర్ఎస్ భారతి వాపోయారు. ‘తర్వాతి రోజే మీకు(మీడియా) క్షమాపణ చెప్పాన’ని ఆయన గుర్తు చేశారు. (కరోనా కన్నా లాక్డౌన్ మరణాలే ఎక్కువ!) -
కిరణ్‌బేడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రచారార్భాటాలు ఎలా ఉన్నా మహిళలపై ఆ పార్టీ నేతల వ్యంగ్యపూర్తి వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ గురువారం పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వివాదానికి తెరదీశారు. ఇటీవల డీఎంకే, డీఎండీకే వర్గాల ఘర్షణ నేపథ్యంలో డీఎంకే కోశాధికారి దురైమురుగన్ డీఎండీకే కోశాధికారి ప్రేమలతపై పరుషమైన వ్యాఖ్యలు చేయడం, ఆ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించిన మీడియా ప్రతినిధులపై ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తరువాత డీఎంకే నేత, నటుడు రాధారవి నటి నయనతారను కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేసి అప్రతిష్టపాలయ్యారు. రాధారవి మాటలు పార్టీకి నష్టదాయకమని భావించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నయనతార వివాదం పూర్తిగా సద్దుమణిగేలోపు డీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీపై మరో వివాదాస్పద బాంబు పేల్చారు. డీఎంకే, అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలను మార్చి ఇక రాజకీయాలు వద్దుబాబోయ్ అంటూ ప్రకటించారు. అయితే ఎన్నికల తరుణంలో మరలా మనసు మార్చుకుని డీఎంకే కోసం వేదికలు ఎక్కుతా అంటూ పార్టీ ఫ్రీలాన్స్ అధికార ప్రతినిధిగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, గురువారం పుదుచ్చేరీలో ఎన్నికల ప్రచారం చేస్తూ, దేశంలో 22 రాష్ట్రాలకు బీజేపీ గవర్నర్లు ఉన్నారు, ఇక్కడ (పుదుచ్చేరీ) కూడా ఒక అమ్మ కిరణ్‌బేడీ గవర్నర్‌గా ఉన్నారు. అయితే కిరణ్‌బేడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక ‘మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. డీఎంకే నేతలు మహిళలపై ఇలా వరుస వ్యాఖ్యానాలకు తావివ్వడం ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు తలనొప్పిగా మారిందనడంలోనూ, సహించరనడంలోనూ సందేహం లేదు. రాధారవిని వెంటనే సస్పెండ్ చేసిన స్టాలిన్ తాజా పరిణామాల నేపథ్యంలో నాంజిల్ సంపత్‌పై ఎలాంటి క్రమశిక్షణ తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
చంద్రబాబు మంచి మిత్రుడు: కేసీఆర్
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారమిక్కడ డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని తెలిపారు. ఈ చర్చలు ఆరంభం కాదు.. ముగింపూ కాదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒక అభిప్రాయానికి రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్నారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలను రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రానికి సూచించారు. దేశ పరిరక్షణ, రక్షణ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించాలని అన్నారు. 2004లో మొదటిసారిగా కరుణానిధిని కలిశానని, 2004లో యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే, టీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేసీఆర్ గుర్తుచేశారు. మే 10 నుంచి రైతుబంధు పథకాన్ని తెలంగాణలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టాలిన్ ఆహ్వానించామన్నారు. తమ స్నేహం చాలాకాలం కొనసాగుతుందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ అనేది లేనేలేదని, భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగుతాయని, ప్రస్తుతం అందరి అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు, నేను మంచి స్నేహితులమని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజకీయ కూటమి నిర్మాణంలో భాగంగా ఎవరినైనా కలిసేందుకు వెనుకాడనని చెప్పారు. -
ఐదేళ్లు నేనే ఉంటా..!
సాక్షి, టీ.నగర్: ఐదేళ్లపాటు తాను రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతానని బన్వరీలాల్ పురోహిత్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి చేపట్టగానే బన్వరీలాల్ జిల్లాల వారీగా వెళ్లి తనిఖీలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయన స్వచ్ఛ భారత్ పనుల్లో పాల్గొనడమే కాకుండా ప్రజల దగ్గర వినతులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతున్నారు. కృష్ణగిరిలో ఈ పనులను పరిశీలించేందుకు గవర్నర్ సోమవారం చెన్నై నుంచి కారులో కృష్ణగిరికి వెళ్లారు. రాత్రి టూరిస్టు బంగ్లాలో బస చేశారు. మంగళవారం ఉదయం గవర్నర్ పురోహిత్ అక్కడ నుంచి కారులో కావేరిపట్టణంకు వెళ్లారు. అక్కడ సఫానిపట్టి ప్రాంతంలో జరిగిన చెన్నై శంకర నేత్రాలయ మొబైల్ కంటి శస్త్ర చికిత్స శిబిరంలో ప్రత్యేక అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో అంధత్వం నివారణకు 2015లో సంచార కంటి శస్త్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటైనట్లు తెలిపారు. తర్వాత ఆయన కావేరి పట్టణంలోని తిమ్మాపురానికి వెళ్లి అక్కడున్న చెత్తల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి బాలకృష్ణారెడ్డి, కలెక్టర్ కదిరవన్ సహా పాల్గొన్నారు. డీఎంకే నిరసన కృష్ణగిరి టోల్గేట్లో ఈస్ట్ జిల్లా డీఎంకే నిర్వాహకులు, ఎమ్మెల్యే సెంగుట్టవన్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న డీఎంకే, కూటమి పార్టీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. -
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
-
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. నిన్న బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
నామినేషన్లు షురూ
తిరువళ్లూరు: తిరువళ్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం ఉదయం డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్, పీఎంకే అభ్యర్థి బాలయోగి నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన డీఎంకే నేతలు వీరరాఘవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచిన తరువాత ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చిదంబరంతో పాటూ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. వంద కోట్లు దాటిన వీజిఆర్ ఆస్తులు: డీఎంకే అభ్యర్థి వీజీ.రాజేంద్రన్ ఆస్తులను అఫిడవిట్లో పొందుపరిచారు. భూమి విలువ రూ.38 కోట్లు, భవనాలు రూ.132 కోట్లు, రూ.76 లక్షలు విలువైన కార్లు, రూ.1కోటి బంగారం, తన తో పాటు భార్య పేరుతో ఉన్నట్టు వివరించారు. దీంతో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.12కోట్లు అప్పు్పలు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద రూ.6లక్షలు భార్య వద్ద రూ.4.59లక్షలు చేతిలో ఉన్నట్టు వివరించారు. తిరువళ్లూరు జిల్లాలో గత 40 సంవత్సరాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో వంద కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వ్యక్తి రాజేంద్రన్ కావడం గమనార్హం. పీఎంకే అభ్యర్థి నామినేషన్: తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీఎంకే అభ్యర్థి బాలయోగి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విఘ్నేశ్వరన్‌కు సమర్పించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ర్యాలీగా వ చ్చి నామినేషన్ దాఖలు చేశారు. బాలయోగి వెంట దినేష్‌కుమార్‌తో సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. -
డీఎంకేది పిల్ల బెదిరింపు
కెప్టెన్ విజయ్‌కాంత్ పళ్లిపట్టు: డీఎంకేది పిల్ల బెదిరింపులని, అన్నాడీఎంకే అవినీతి సొమ్ముతో సామాన్యులను కొని జనాక్షరణగా చేస్తున్న ప్రచారాలు ఎన్నికల్లో చెల్లవని డీఎండీకే అద్యక్షుడు విజయకాంత్ ఎద్దేవా చేశారు. డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి, తమాకాతో పాటు ఆరు పార్టీల ఆధ్వర్యంలో పొత్తు ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా శుక్రవారం రాత్రి తిరుత్తణిలో బహిరంగ సభ నిర్వహించారు. టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, ఎండీఎంకే జిల్లా కార్యదర్శి డీఆర్ ఆర్ సెంగుట్టవన్, వీసీకే జిల్లా కార్యదర్శి సిద్ధార్థన్, సీపీఐ జిల్లా కార్యదర్శి కన్నన్, సీపీఎం జిల్లా కార్యదర్శి పన్నీరు సెల్వం, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌తో సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కెప్టెన్ విజయకాంత్ పాల్గొని అభ్యర్థి కృష్ణమూర్తిని పరిచయం చేసి మాట్లాడారు. తను కూటమిలో ఆరు పార్టీలున్నాయని కూటమి పార్టీల అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని, తిరుత్తణిలో కృష్ణమూర్తికి ఢంకా గుర్తుకు ఓట్లేయాలని పిలుపు నిచ్చారు. డీఎంకే పిల్ల బెదిరింపులతో స్టాలిన్ జపం చేస్తున్నారని, అలాగే అన్నాడీఎంకే డబ్బుతో నిరుపేదలను కొనుగోలు చేసి భారీగా బహిరంగ సభలు చూపి ప్రచారాలకు పరిమితమవుతున్నట్లు చెప్పారు. అయితే తమ కూటమి ఎలాంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రజలను గురి చేయకుండా ప్రజలే ఆసక్తిగా తమ వెంట నడుస్తున్నట్లు చెప్పారు. -
డీఎంకే నాయకులపై హత్యాయత్నం
ప్యారిస్: సేలంలో డీఎంకే నాయకులను హత్య చేసేందుకు వేచి ఉన్న కిరాయి ముఠా సహా ఏడుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సేలం కిచ్చిపాళయంకు చెందిన కేబుల్ శరవణన్ (36). డీఎంకే యువజన విభాగం నాయకుడు. ఇతని స్నేహితుడు చెల్లదురై (35). వీరిపై పలు కేసులు ఉన్నాయి. వీరి స్నేహితులు పేచ్చియమ్మ నగర్‌కు చెందిన శక్తి (25), ప్రదీప్ (32), అమ్మాపేట పాండియన్ (24), మణియనూర్ గోపినాథ్ (24), పన్నయపట్టి మణి, సెవ్వాపేటై శంకర్. ఈ క్రమంలో కేబుల్ శరవణన్, చెల్లదురై, అతని స్నేహితుల మధ్య పాత కక్షలున్నాయి. దీంతో వీరిద్దరిని హత్య చేసేందుకు అతని స్నేహితులు నిర్ణయించారు. ఇందు కోసం తిరునెల్వేలి సుత్తమల్లికి చెందిన సుందర్ (25), సుడలైకన్నన్ (23), సతీష్ (23)తో కూడిన కిరాయి ముఠాను సేలంకు తీసుకొచ్చారు. అనంతరం కిరాయి ముఠాతో కలిసి శక్తి, ప్రదీప్, పాండియన్, గోపినాథ్, మణి, శంకర్ చెల్లదురైను హత్య చేసేందుకు వెంబడించారు. వారి నుంచి చెల్లదురై తప్పించుకున్నారు. దీని గురించి కిచ్చిపాళయం పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో కిరాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసు కమిషనర్ ఎ.అమల్‌రాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్స్పెక్టర్ రాజా ఆధ్వర్యంలోని పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. సన్యాసి గుండు ప్రాంతంలో కిరాయి ముఠా దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ దాగి ఉన్న శక్తి, ప్రదీప్, సుడలై కన్నన్, సతీష్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు వేట కత్తులు, రూ.2,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నెత్తిమేడు కరియ పెరుమాల్ కోయిల్ కరడు ప్రాంతంలో దాగి ఉన్న సుందరన్, పాండియన్, గోపినాథ్‌ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకునే సమయంలో వారి కాళ్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. విచారణలో శక్తి, ప్రదీప్, మణి చెల్లదురై, కేబుల్ శరవణన్‌ను హత్య చేసేందుకు రూ.1.5 లక్ష ఇచ్చేవిధంగా తిరునెల్వేలికి చెందిన రౌడీలు సుందర్, సుడలై కన్నన్, సతీష్‌ను రప్పించినట్టు తెలిసింది. విచారణ తర్వాత నలుగురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
బుజ్జగింపులు
సాక్షి, చెన్నై : నటి ఖుష్బును బుజ్జగించేందుకు డీఎంకే ద్వితీయ శ్రేణి నేతలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిర్ణయాన్ని పునఃసమీక్షించబోయేది లేదంటూ ఖుష్బు కుండ బద్ధలుకొట్టినట్లు సమాచారం.ఖుష్బు డీఎంకేకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిం దే. కమలం గూటికి చేరడానికి ఆమె సన్నద్ధ అవుతున్నట్టు సంకేతాలు వెలువుడుతున్నాయి. ఈ సమయంలో డీఎంకే ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు బుజ్జగించినట్లు వెలుగులోకి వచ్చింది. పార్టీలో ప్రత్యేకంగా మహిళా సినీ గ్లామర్ అంటూ ఎవ్వరూ లేని దృష్ట్యా, ఆ గ్లామర్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్న డైలమాలో డీఎంకే అధిష్టానం పడ్డట్టు సమాచారం. అధినేత ఎం కరుణానిధి సూచన మేరకు ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఖుష్బును బుజ్జగించే పనిలో పడ్డారు. ఖుష్బు సన్నిహితంగా ఉన్న వారి ద్వారా కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆవేదన : బుజ్జగింపుల బాట పట్టిన నాయకులు, సన్నిహితుల వద్ద ఖుష్బు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. దివంగత పెరియార్ సిద్ధాంతాలతో, దివంగత అన్నా ఆదర్శంతో ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న కరుణానిధి మార్గదర్శకంలో పనిచేయాలన్న కాంక్షతో డీఎంకేలో చేరినట్టుగా వారికి వివరిస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న సమయంలో తనలాంటి వారికి డీఎంకేలో చోటు లేదన్న విషయాన్ని గ్రహించినట్టు వాపోతున్నారు. పార్టీ కి మంచి జరగాలన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేస్తే, ఇంటిపై రాళ్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తన పిల్లలు ఆ క్షణంలో పడ్డ మనోవేదన కళ్ల ముం దు ఇంకా మెదులుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనకు లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా కోయంబత్తూరు సీటు ఇవ్వాలని కోరిగా, అందుకు పార్టీలోని కొందరు పెద్దలు అవహేళన చేసినట్టుగా ఆరోపిస్తున్నారు. అధినేత తర్వాత ఆయన స్థానంలో కూర్చోవాలనుకుంటున్న వారు తనను పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకున్నారంటూ పరోక్షంగా స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తనను తీవ్రంగా అవమానించారని, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కించ పరచడంతో చివరకు అధినేత కరుణానిధికి తన రాజీనామా పంపాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారట. అదే సమయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని, పునః సమీక్షించే ప్రసక్తే లేదంటూ ఖుష్బు కరాఖండిగా తేల్చుతుండడం గమనార్హం. ఇక, ఖుష్బు రాజీనామా గురించి డీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు టీకేఎస్ ఇళంగోవన్‌ను కదిలించగా, తాను పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా అధిష్టానం దృష్టికి ఆమె తెచ్చి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొనడం కొసమెరుపు.