విజయ్
తమిళనాడు రాజకీయాలు సినిమా స్టార్స్ ఎంట్రీతో రసవత్తరంగా మారాయి. నటుడు కమల్‌హాసన్, రజనీకాంత్ సొంత పార్టీలు పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అలాగే నటుడు విశాల్ కుడా ఆ మధ్య బై ఎలక్షన్స్‌లో పోటీ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లోకి విజయ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెన్నై మీడియా టాక్. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ఆయన అభిమానులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.
ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట విజయ్ అండ్ టీమ్. ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ అని విజయ్ ఫ్యాన్స్ ఓ వెబ్‌సైట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌లో ప్రతి జిల్లా ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్‌ను ఎంట్రీ చేసి, వారికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నారట. త్వరలోనే ఓ యాప్‌ను కూడా తయారు చేయనున్నారని సమాచారం.
ఇవన్నీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసమా? అని కొందరు అడిగితే.. ‘అలాంటిదేం లేదు. కేవలం టెక్నాలజీని వాడుకొని ఫ్యాన్స్‌ను రెగ్యులేట్ చేయడం కోసమే.. పాలిటిక్స్ సెకండరీ’ అని పేర్కొన్నారట విజయ్ సన్నిహిత వర్గాలు. పాలిటిక్స్ పై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వనప్పటికీ విజయ్ ప్రతి సినిమాలోనూ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగా మెసేజ్ ఇస్తూ వస్తున్నారు. మరి పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారు? అన్నది కాలమే నిర్ణయించాలి.
Comments
Please login to add a commentAdd a comment