kamalhaasan
-
నా ఇంటినే ఆస్పత్రిగా మారుస్తా
సాక్షి చెన్నై: ప్రజలకు వైద్యసేవలందించడానికి తన ఇంటినే ఆస్పత్రిగా మారుస్తానని ప్రముఖ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో కమల్ స్పందించారు. ఆయన ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటినే వైద్యశాలగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. దీని గురించి కమల్‌హాసన్ బుధవారం తన ట్విటర్లో పేర్కొన్నారు. (ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!) ఈ కష్టకాలంలో పేదలకు వైద్య సేవలందించడానికి మక్కళ్ నీది మయ్యంకు చెందిన వైద్యులను పిలిపించి తాను నివశించడానికి నిర్మించుకున్న భవనాన్ని తాత్కాలిక వైద్యశాలగా మార్చాలని భావిస్తున్నానన్నారు. అందుకు ప్రభుత్వం అనుమతిస్తే తన భవనాన్ని వైద్యశాలగా మార్చడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా సినిమాలు రద్దు కావడంతో దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. కమల్ కూడా రూ.10 లక్షలను ఫెఫ్సీకి అందించారు. (డేంజర్ బెల్స్!) -
రాజకీయాల్లోకి?
తమిళనాడు రాజకీయాలు సినిమా స్టార్స్ ఎంట్రీతో రసవత్తరంగా మారాయి. నటుడు కమల్‌హాసన్, రజనీకాంత్ సొంత పార్టీలు పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అలాగే నటుడు విశాల్ కుడా ఆ మధ్య బై ఎలక్షన్స్‌లో పోటీ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లోకి విజయ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెన్నై మీడియా టాక్. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ఆయన అభిమానులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట విజయ్ అండ్ టీమ్. ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ అని విజయ్ ఫ్యాన్స్ ఓ వెబ్‌సైట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వెబ్సైట్లో ప్రతి జిల్లా ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్‌ను ఎంట్రీ చేసి, వారికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నారట. త్వరలోనే ఓ యాప్‌ను కూడా తయారు చేయనున్నారని సమాచారం. ఇవన్నీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసమా? అని కొందరు అడిగితే.. ‘అలాంటిదేం లేదు. కేవలం టెక్నాలజీని వాడుకొని ఫ్యాన్స్‌ను రెగ్యులేట్ చేయడం కోసమే.. పాలిటిక్స్ సెకండరీ’ అని పేర్కొన్నారట విజయ్ సన్నిహిత వర్గాలు. పాలిటిక్స్ పై అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ ఇవ్వనప్పటికీ విజయ్ ప్రతి సినిమాలోనూ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగా మెసేజ్ ఇస్తూ వస్తున్నారు. మరి పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారు? అన్నది కాలమే నిర్ణయించాలి. -
మలేషియాలో రజనీ, కమల్
-
‘ఆయన లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదగడానికి హిందువులను దుయ్యబడితేనే నాయకులు అవుతారా అంటూ కమల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కమల్ లోకనాయకుడు కాదు...లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు. మీరు కమల్‌హాసన్ కాదు. ఉగ్రవాది కమల్‌హాసన్. హిందువులను విమర్శిస్తే రాజకీయ నేతగా ఎదుగుతారా?. హిందువులను తీవ్రవాదులన్నవారు కచ్చితంగా ఉగ్రవాదులే. హిందు ధర్మాన్ని కించపరిచి కమల్ ధర్మద్రోహిగా మారారు. తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కమల్‌కు పిచ్చి పట్టింది. హిందుమతంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సంహార ప్రక్రియను కమల్ చూస్తారు. కమల్ వేషం వెనుక విషం ఉంది.’ అని నిప్పులు చెరిగారు. సినిమాలు తీసేటప్పుడు హిందువులు కావాల్సి వచ్చిందని, ఇపుడు హిందూ మతాన్ని కించపరిచే కమల్ ధర్మద్రోహిగా ఎదిగాడని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కట్టిన బట్ట, నివాసం, సుఖభోగాలతో కూడుకున్న జీవన విధానం హిందూ సమాజానిది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడు రాజకీయాల్లోకొచ్చినా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించారంటూ రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. హిందూమతంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని చవిచూస్తారని పరిపూర్ణానందస్వామి హెచ్చరించారు. -
బీజేపీకి రజనీయే సరైన భాగస్వామి: కమల్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మత విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీకి మిత్రుడిగా సరిపోతారనీ నటుడు కమల్ హాసన్ సోమవారం అన్నారు. రాజకీయ ప్రవేశంపై తనను, రజనీని పోల్చడం సరికాదన్నారు. తానో హేతువాదిననీ, తమిళనాడులో అచ్చే దిన్ (మంచిరోజులు) లేవనీ, ఇతర రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనంటూ కమల్ పరోక్షంగా తాను బీజేపీకి దూరమనే సంకేతాలనిచ్చారు. తన రంగు కాషాయం మాత్రం కాదంటూ ఆయన గతంలోనూ వ్యాఖ్యానించడం తెలిసిందే. రాష్ట్రంలోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఏంకే, అన్నాడీఎంకేకు పోటీగా ఈ ఏడాదిలోపు కొత్త పార్టీని స్థాపిస్తానని కమల్ చెప్పారు. కులతత్వం, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం ఉంటుందనీ, పార్టీ స్థాపన గురించి ప్రస్తుతం వివిధ వ్యక్తులతో మాట్లాడుతున్నానని కమల్ పేర్కొన్నారు. -
రెండూ కళాఖండాలే
ప్రస్తుత సమాజంలో పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా రంగంలో ప్రస్తుతం ఇలాంటి పోటీతత్వమే నెలకొంది. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాల విడుదల విషయంలో పోటీ అనివార్యంగా మారుతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అజిత్, విజయ్ చిత్రాలు పోటీకి దిగాయి. ప్రస్తుతం కమల్‌హాసన్, రజనీ కాంత్ వంటి దిగ్గజాల తరువాత అంత స్టార్ స్టామినా ఉన్న నటులు అజిత్, విజయ్. చాలా కాలం తరువాత వీరు నటించిన వీరం, జిల్లా చిత్రాలు పోటీ పడ్డాయి. వీటి రిజల్ట్ కోసం చాలా ఆసక్తికరమయిన పరిస్థితి ఎదురైనా అదృష్టవశాత్తు ఈ రెండు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నాయి. అయితే ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్, కమల్‌హాసన్ నటిస్తున్న విశ్వరూపం-2 చిత్రాల మీద అందరి దృష్టి పడింది. ఈ రెండూ ప్రత్యేకమైన కళాఖండాలు కావడం మరో విశేషం. - న్యూస్‌లైన్ , తమిళ సినిమా ఆ రెండు చిత్రాల మధ్య పోటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన విషయం రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్, కమ ల్ హాసన్ నటిస్తున్న విశ్వరూపం-2, చిత్రాలు ఒకేసారి తెరపైకి రానున్నాయన్నదే. ఈ రెండు చిత్రాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నాయి. క్యాప్చరింగ్ టెక్నాలజీతో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ అద్భుత విజువల్ ట్రిట్గా ఉండబోతోంది. క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో వండర్స్ క్రియేట్ చేయనున్న తొలి భారతీయ సినిమాగా కోచ్చడయాన్ నమోదు కానుంది. హాలీవుడ్ తరహాలో అవతార్, టిన్టిన్ చిత్రాల తరువాత అద్భుత సృష్టి గా కోచ్చడయాన్ ఉంటుందంటున్నారు. చిత్ర దర్శక నిర్మాతలు ఎందిరన్ తరువాత రజనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చారిత్రక, పౌరాణిక కథా చిత్రం కోచ్చడయాన్. రజనీ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం భారతీయ సిని మా స్థాయిని మరింత పెంచుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. యూకేలోని అత్యంత ఆధునిక టెక్నాలజీ గల స్టూడియోలలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కోచ్చడయాన్. తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్‌పూరి, బెంగాలీ, పంజాబ్ మొదలగు భాషలతోపాటు ఆంగ్లంలోనూ ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన చిత్ర ఆడియోను ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. సెల్యులాయిడ్ థ్రిల్లర్ విశ్వరూపం - 2 విశ్వనటుడుగా పేరుగాంచిన పద్మభూషణ్ కమల్‌హాసన్ కెరీర్లో మరో అద్భుత సృష్టిగా నిలిచిపోయే చిత్రం విశ్వరూపం - 2. ఇంతకు ముందు కమల్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన విశ్వరూపం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా వెండితెర ఆవిష్కరణే విశ్వరూపం -2 అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పుడూ చాలా అడ్వాన్స్డుగా ఉండే కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని ఆధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దుతున్నారు. విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న విశ్వరూపం 2 తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో ఆండ్రియా, పూజా కుమార్, వహిదా రెహ్మాన్, హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీబ్రాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని కమల్‌హాసన్ ఇటీవల వెల్లడించారు. చిత్రాన్ని మరో మూడు నెలల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విశ్వరూపం-2 కూడా ఏప్రిల్‌లోనే తెరపైకి రానున్నట్లు సమాచారం. కోచ్చడయాన్, విశ్వరూపం-2 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా తమిళ ఉగాదిని పురస్కరించుకుని ఒకే సారి తెరపైకి వచ్చే అవకాశం ఉందా? ఒక వేళ అలాంటి సందర్భమే కనుక ఎదురయితే థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకుంటాయూ? లాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నారుు. ఏప్రిల్ పైనే అందరి కళ్లు సంక్రాంతి చిత్రాల క్రేజీ తగ్గుతుంటే, ఏప్రిల్‌లో విడుదలయ్యే చిత్రాలపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇందుకు కారణం నట దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలు విడుదల కావడమే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్, కమల్‌హాసన్ విశ్వరూపం-2 చిత్రాలు ఏప్రిల్‌లో విడుదలకానున్నారుు. వీరు కోలీవుడ్‌కు రెండు కళ్లు లాంటివారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమాన బలం ఉన్న కళామతల్లి ముద్దు బిడ్డలు వీరు. అలాంటి నటుల చిత్రాలు పోటీ పడి చాలా కాలం అయ్యింది. ఆ ఇద్దరి కలయికే కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు కమల్, రజనీ కలిసి నటించినవే. దీంతో కమల్, రజని కలయికలో చిత్రం వస్తుందంటేనే అంచనాలు తారాస్థాయికి చేరేవి. చిత్ర నిర్మాణ వ్యయం భారీగానే పెరగడంతో కమల్, రజనీ ఇకపై కలిసి నటిం చరాదనే నిర్ణయానికొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమల్, రజనీ కాంబినేషన్లో చిత్రం తీయాలని చాలా మంది విశ్వప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. వారి గురువు కె.బాలచందర్‌కి కూడా ఇలాంటి కోరిక బలంగా ఉంది. కానీ ఇది సాధ్యపడే విషయం కాదనిపిస్తోంది. -
అనురాగ సంగమం
జూన్ 3న సాగర సంగమం విడుదలైంది. జూలై 3న అలేఖ్య, వినయ్‌ల పెళ్లయింది. ఈ ముప్పై ఏళ్ల దాంపత్య జీవితంలో... ఇద్దరూ కలిసి చూసిన సినిమా సాగర సంగమం ఒక్కటే! అది కూడా పెళ్లికి ముందర! వినయ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అలేఖ్య ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. ప్రముఖులైన భార్యాభర్తలకు... సినిమాలకు, షికార్లకు టైమ్ దొరక్కపోవడంలో ఆశ్యర్యం లేదు. అయితే ‘దొరకని టైమ్’లో ఈ దంపతులు దొరకపుచ్చుకున్నవి చాలా ఉన్నాయి! ఆమె అభినయం... ఆయన పరవశం. ఆయన అనునయం... ఆమె జన్మఫలం. ‘మనసే జతగా...’ సాగిన వీరి దాంపత్యం... ఒక అనురాగ సంగమం! అచ్చ తెలుగింటి ఆహార్యంతో కనిపించే ఆమె పేరు అలేఖ్యపుంజాల. కూచిపూడి నృత్యకళాకారిణి. మూడు దశాబ్దాలుగా నృత్యరీతులెన్నింటినో వేదికల మీద అభినయిస్తున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు కూచిపూడి విభాగానికి అధిపతిగా విధులను నిర్వర్తిస్తున్నారు. వేదికమీద లయబద్ధంగా అందెల రవళులు చేస్తూనే, విధి నిర్వహణలో మెలకువగా ఉంటూనే, ఇంటిల్లిపాదికి స్వయంగా వంట చేసి ఆప్యాయంగా వడ్డన చేయడం... ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అని ఆమెను ఆడిగితే చిరునవ్వుతో తన శ్రీవారు డాక్టర్ వినయకుమార్ వైపు చూశారు ఆమె. ఈ డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ‘‘నాట్యం అంటే నాకు అమితమైన ప్రేమ. నా నాట్యాన్ని ప్రేమించడం ఈయనకు హాబీ’’ అంటూ సంసారపు తొలి అడుగులను గుర్తుచేసుకుంటూ తమ దాంపత్య బంధంలోని మధురానుభూతులను మనముందుంచారు అలేఖ్య. ఇద్దరూ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! వినయ్‌కుమార్ అక్క, అలేఖ్య ఇద్దరూ డ్యాన్స్ క్లాస్‌లో స్నేహితులు. అక్కను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు అలేఖ్యను చూసి, మొదటి చూపులోనే ప్రేమించేశారట ఈ డాక్టర్‌గారు. వెంటనే వెళ్లి ఆమెకు తన మనసులోని మాట చెప్పేశారట. ‘పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇరువైపుల కుటుంబాలూ సరే అనాలి. ముందు పెద్దలందరినీ ఒప్పించండి’ అని చెప్పారట అలేఖ్య. దాంతో నేరుగా ఆమె తల్లిదండ్రులను కలిశారు వినయ్‌కుమార్. పెళ్లినాటి పరిస్థితులను అలేఖ్య వివరిస్తూ-‘‘ముందు వీళ్ల అమ్మగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. కొడుకు డాక్టర్ కాబట్టి మెడిసిన్ చదివిన అమ్మాయి అయితేనే కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు. ఈయన మూడేళ్ల మౌనవ్రతానికి ఆవిడా సరే అనక తప్పలేదు. మొత్తానికి ఇరువైపుల పెద్దల అంగీకారంతో జూలై 3, 1983లో మా పెళ్లి అయ్యింది. అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబం.. కొద్దిరోజుల్లోనే వారందరితో కలిసిపోయాను. ముందు మా పెళ్లిని కాదన్న మా అత్తగారే నన్ను కూతురిలా చూసుకునేవారు. ‘ఎదుటి వారికి మంచిని పంచితే నీకు మంచే వస్తుంది’ అని మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. ఆ సూచనను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను’’ అన్నారు ఆమె. వీలైనంత ఎక్కువ సమయం... పెళ్లయిన తర్వాత ఇంటిని చక్కదిద్దుకున్న విధానాన్ని చెబుతూ-‘‘ఈయన చాలా మితభాషి. ఏదీ బయటకు చెప్పేవారు కాదు. ఈయన వ్యక్తిత్వాన్ని అర్థ్ధం చేసు కుని అందుకు అనుగుణంగా నన్ను నేను తీర్చిదిద్దు కోవ డానికి కొంత కాలం పట్టింది. అదేవిధంగా భార్యగా, కోడలిగా బాధ్యతల నడుమ రోజూ డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడం కుదిరేది కాదు. ప్రాక్టీస్‌ను ఐదేళ్ల పాటు వారానికి రెండు రోజులకు తగ్గించుకున్నాను. పెద్దబాబు పుట్టి, వాడిని స్కూల్లో జాయిన్ చేశాక మా గురువుల సూచనతో అధ్యాపకురాలిగా యూనివర్శిటీలో చేరాను. అభిరుచి, ఉద్యోగం, ఇల్లు... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డాను. దాంతో పనులను విభజించుకోవడం మొదలుపెట్టాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లు, డ్యాన్స్ క్లాస్‌లు, ప్రాక్టీస్, రీసెర్చ్.. సమయానుకూలంగా చూసుకుంటూనే కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంట్లోని వారితో ఎక్కువగా మాట్లాడుతూ, అరమరికలు లేకుండా చూసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి అనేది నా నమ్మకం. ఇప్పటికీ ఈ సూత్రాన్ని పాటిస్తుంటాను’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘ఈవిడ ఎప్పుడైనా నొచ్చుకుంటే... రెండు మూడు రోజులవరకు మూడీగా ఉంటుంది. తనంతట తనే ఆ బాధ నుంచి బయటపడాలి తప్ప ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. తన మూడ్ మారేంతవరకు ఓపిగ్గా ఎదురు చూడటం ఇప్పటికీ నాకు అలవాటు’’ అంటూ భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తీరును వివరించారు వినయ్‌కుమార్! ప్రోత్సాహమిచ్చిన బంధం కళాకారిణిగా తన భర్త ప్రోత్సాహంతోనే నాట్యంలో ఎన్నో ప్రయోగాలను చేయగలిగాను. నేను ప్రోగ్రామ్‌లు, క్లాస్‌లు అంటూ వెళ్లినప్పుడు పిల్లలను ఈయనే చూసుకునేవారు’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘తనకు పేరు వస్తుందంటే అది నాకు వచ్చినట్టుగానే భావిస్తాను’’ అని వినయ్‌కుమార్ సంతోషంగా చెప్పారు. అలేఖ్య మాట్లాడుతూ- ‘‘నా డ్యాన్స్ ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేయడం దగ్గరనుంచి, అందరికీ పంచడం వరకు ఈయనే చూసుకుంటారు. ఈయన ప్రోత్సాహం వల్లే నేను పీహెచ్‌డి చేసి డాక్టరేట్ తీసుకోగలిగాను. ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందగలిగాను’’ అన్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒకరు ‘లా’ మరొకరు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్‌లు చేస్తున్నారు. ‘స్నేహం’గా విశాలమైన కుటుంబం... కుటుంబమంటే... ఇరువైపులా బంధువులతో పాటూ ఇరువైపు స్నేహాలూ సవ్యంగా ఉండాలనేది ఈ దంపతుల మాట. ‘‘మా ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. వారి కుటుంబాలతో సహా అందరం తరచూ కలుసుకుంటాం’’ అన్నారు వినయ్‌కుమార్. ‘‘ఈయనకు నిరుపేదలు చాలా ముఖ్యమైన స్నేహితులు. హాస్పిటల్‌కి వచ్చే పేదలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నెలకు ముప్పై సర్జరీలెనా పేదవారికి ఉచితంగా చేసేవారు. ఈయన చికిత్స చేసిన పేషంట్స్ దగ్గు వచ్చినా ఈయనకే ఫోన్ చేస్తుంటారు. ఇది మీకు సంబంధించింది కాదు కదా! అలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవడం ఎందుకు అని అంటుంటాను. కాని, వారికి ఓపికగా చెప్పే సమాధానాలు వింటున్నప్పుడు ఈయనలోని సహనానికి ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది’’ అన్నారు ఆమె. ‘‘దాంపత్యం అంటే అర్థం ఏంటో కాబోయే ప్రతి జంట తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. డబ్బు ప్రధానం కాదు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంత సమయం, శక్తి ఉపయోగిస్తే అంతగా ఆ ఇద్దరి బంధం బాగుంటుంది’’ అన్నారు ఈ దంపతులు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘అలేఖ్య ఒక్క డ్యాన్స్ అనే కాదు... ఇంటి అలంకరణ, వంట, ఉద్యోగం, అందరితో కలివిడిగా ఉండటంలో ఎక్కడా చిరునవ్వు చెదరనీయదు. - డా. పి. వినయ్‌కుమార్ ఇంట్లో డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేయాలన్నా, క్లాస్‌కు వెళ్లాలన్నా,.. నాకు నచ్చినట్టు సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు ఆ ప్రోత్సాహమే నా బలం. - అలేఖ్య పుంజాల -
బుల్లితెరకు ‘విశ్వరూపం 2’
థియేటర్లో విడుదలైన రోజున అదే సినిమా బుల్లితెరపై కూడా ప్రసారమైతే.. ఎలా ఉంటుంది? ఇంటిల్లిపాదీ హాయిగా ఆ సినిమాని ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. కానీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య సంగతేంటి?... ఇదే విషయం గురించి దాదాపు నాలుగైదు నెలల క్రితం భారీ ఎత్తున చర్చలు జరిగాయి. ఆ చర్చలకు కారణం కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘డీటీహెచ్’లో (డెరైక్ట్ టు హోమ్) విడుదల చేస్తానని కమల్ ప్రకటించగానే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. థియేటర్లో విడుదల చేసిన రోజునే టీవీల్లో సినిమా వచ్చేస్తే మా గతేం కాను అంటూ తమిళనాడులోని ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆ రకంగా డీటీహెచ్కి బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు ‘విశ్వరూపం 2’ని ఈ విధానం ద్వారా విడుదల చేయాలని కమల్ అనుకుంటున్నారట. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే యూఎస్‌లో అయినా ఈ విధానంలో విడుదల చేయాలన్నది కమల్ నిర్ణయం. మరి.. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘విశ్వరూపం 2’ విడుదలయ్యే అవకాశం ఉంది. -
గాయపడ్డ కమల్
సినిమా కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. అలాంటివారిలో కమల్‌హాసన్ పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఓ పాత్రకు న్యాయం చేయడం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి వెనుకాడరు కమల్. అందుకు బోల్డన్ని ఉదాహరణలున్నాయి. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో అప్పు పాత్రను పండించడం కోసం మోకాళ్లను వెనక్కి మడిచేసి, ఆ మోకాళ్లకు షూస్ వేసుకుని నటించారాయన. శరీరాన్ని ఎంత హింసపెట్టి ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. పోరాట దృశ్యాల్లో సైతం కమల్ రిస్కులు తీసుకుంటుంటారు. ఫలితంగా గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఇలాంటి ప్రమాదకర పోరాటాలను ఎంజాయ్ చేస్తానని, అవి చేస్తున్నప్పుడు లభించే కిక్కే వేరని ఇటీవల ఓ సందర్భంలో కమల్ పేర్కొన్నారు. తాజాగా ‘విశ్వరూపం 2’ కోసం మరోసారి గాయపడ్డారు కమల్. ఈ చిత్రం కోసం ఇటీవల కొడెకైనాల్లో రిస్కీ ఫైట్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో కమల్ గడ్డానికి గాయమైంది. చిన్నదేలే అని తేలికగా తీసుకుని, షూటింగ్ కంటిన్యూ చేసే గాయం కాదది. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి సూచించారట. ఆ తర్వాత మళ్లీ ఈ రిస్కీ ఫైట్ షూటింగ్లో పాల్గొంటారు కమల్. ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా తీస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకున్నారట. కానీ గాయం కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడటంతో దీపావళికి విడుదలవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అనుకున్న సమయానికి విడుదలైతే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? లేట్ అయినా ఈ చిత్రం లేటెస్ట్గా ఉంటుందని మాత్రం ఊహించవచ్చు. ఇందులో కమల్ సరసన పూజాకుమార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇంకా శేఖర్‌కపూర్,ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.