బుల్లితెరకు ‘విశ్వరూపం 2’ | vishwaroopam-2 to be released in TV through dth | Sakshi
Sakshi News home page

బుల్లితెరకు ‘విశ్వరూపం 2’

Published Tue, Oct 1 2013 11:38 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

బుల్లితెరకు ‘విశ్వరూపం 2’ - Sakshi

బుల్లితెరకు ‘విశ్వరూపం 2’

 థియేటర్లో విడుదలైన రోజున అదే సినిమా బుల్లితెరపై కూడా ప్రసారమైతే.. ఎలా ఉంటుంది? ఇంటిల్లిపాదీ హాయిగా ఆ సినిమాని ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. కానీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య సంగతేంటి?... ఇదే విషయం గురించి దాదాపు నాలుగైదు నెలల క్రితం భారీ ఎత్తున చర్చలు జరిగాయి. ఆ చర్చలకు కారణం కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 ఈ చిత్రాన్ని ‘డీటీహెచ్’లో  (డెరైక్ట్ టు హోమ్) విడుదల చేస్తానని కమల్ ప్రకటించగానే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. థియేటర్లో విడుదల చేసిన రోజునే టీవీల్లో సినిమా వచ్చేస్తే మా గతేం కాను అంటూ తమిళనాడులోని ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆ రకంగా డీటీహెచ్‌కి బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు ‘విశ్వరూపం 2’ని ఈ విధానం ద్వారా విడుదల చేయాలని కమల్ అనుకుంటున్నారట.
 
 ఒకవేళ ఇక్కడ కుదరకపోతే యూఎస్‌లో అయినా ఈ విధానంలో విడుదల చేయాలన్నది కమల్ నిర్ణయం. మరి.. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘విశ్వరూపం 2’ విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement