Vishwaroopam
-
20 రోజులపాటు 40 టన్నుల ఇసుకతో శైతక శిల్పం
-
శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి
ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి. ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది. మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది. ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో గంగభః శంభుసేవనమ్’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు. అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది. ‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రజనీకాంత్‌కు కమల్ మద్దతు!
చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చిత్రవర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రజనీతో రాజకీయంగా, పలు అంశాల్లో విభేదిస్తున్నప్పటికీ సినిమాల పరంగా తాము ఎప్పటికీ ఒక్కతాటిపైనే నిలుస్తామని నిరూపించారు కమల్ హాసన్. కాలా మూవీ విడుదల వివాదం నేపథ్యంలో కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో రజనీకి తన మద్దతు ఉంటుందన్నారు. తన విశ్వరూపం సినిమాను కూడా కర్ణాకటలో నిషేధించిన విషయాన్ని కమల్ గుర్తుచేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. రజనీ తాజా చిత్రం కాలాను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కమల్ పేర్కొన్నారు. రైతుల సమస్యల తరహాలోనే ప్రతి సమస్య, వివాదాన్ని సంబంధిత బోర్డు, శాఖగానీ చర్చించి సమసిపోయేలా చేయాలని సూచించారు. కాగా, కాలా మూవీ విడుదలకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రజనీకాంత్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద భద్రతా కల్పించాలని కన్నడ భాషలో ఓ సందేశాన్ని కుమారస్వామికి పంపారు. మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా.. ప్రస్తుతం వివాదాలు తలెత్తుతాయని కొన్ని రోజులు వేచి చూడాలని కుమారస్వామి సూచిస్తున్నారు. ఓవైపు నాడార్ సంఘం మూవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాలాలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా సీన్లున్నాయని, అందుకు మూవీ విడుదలను అడ్డుకుంటామని నాడార్ వర్గం హెచ్చరిస్తోంది. -
జయ టార్గెట్ చేశారు
♦ విశ్వరూపం విడుదలలో రాజకీయం ♦ కామరాజనాడార్, ఎంజీఆర్, శివాజీ కూడా విద్యావేత్తలు కాదు ♦ పౌరుడిగా విమర్శించే హక్కుంది ♦ రాజకీయ పార్టీకోసం ఒత్తిడి చేయవద్దు ♦ ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను టార్గెట్ చేశారని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రశ్నకు బదులేదీ’ కార్యక్రమం కింద ‘తంది’ తమిళచానల్కు కమల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆంశాలను ఆయన ముక్కుసూటిగా ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే.. రాజకీయ విమర్శలు కొత్తగా చేస్తున్నవి కాదు, ముఖ్యమంత్రి జయలలిత నా సినీజీవితంపై ప్రత్యేకంగా గురిపెట్టారు. విశ్వరూపం సినిమాలో ఒక సామాజికవర్గాన్ని కించపరచలేదు, ఈ విషయాన్ని వారే అంగీకరించారు. సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆనాటి పాలకుల రాజకీయమే. సినిమాను రాజకీయం చేసిన ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిపోయిన నేను రాష్ట్రం లేదా దేశం విడిచి వెళతానని అన్నాను. అంటే తెల్లదొరలతో చేరిపోతానని కాదు. ఇలాంటి వేధింపులు లేని మరో రాష్ట్రంలో స్థిరపడతానని అర్థం. నేను తీసుకున్న నిర్ణయానికి సిగ్గుపడాల్సిన నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని నేను విమర్శలు చేయడం లేదు, ప్రజలతో పంచుకుంటున్నాను. దేశం మంచి మార్గంలో పయనించాలని ఒక పౌరుడిగా కోరుకోవడం, విమర్శించిడం నా హక్కు. దీన్ని ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను. రజనీకాంత్ పార్టీ పెట్టినా తప్పుంటే విమర్శలకు వెనుకాడను. తమిళనాడు ప్రజలు నాయకత్వ లక్షణాలను ఉన్నవారిని కాకుండా నిపుణులను మాత్రమే వెదుకుతున్నారు. నాకు కనీసం ప్రాథమిక విద్య కూడా లేదని కొందరు హేళన చేస్తున్నారు. కామరా>జనాడార్ చదుకోకున్నా ప్రత్యేకమైన సమర్థత కలిగిన వారు, ప్రజల మన్నలను పొందారు. శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ కూడా ఉన్నత విద్యలు అభ్యసించలేదు. అయితే వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా నిరూపించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు నేడు అటువంటి నేతలు లేరు. నిర్మాతగా, నటుడిగా సరైన మార్గంలో వెళుతున్నా, క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. నా చిన్నతనం నుంచే ఇంట్లో అందరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మనఃపూర్వకంగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. ఈ చర్చల్లో ఆస్తికత్వం, నాస్తికత్వం అంశాలు కూడా మా చర్చల్లో చోటు చేసుకుంటాయి. మనసుకు తోచిన అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఎప్పుడూ నేను జంకలేదు. -
విశ్వరూపం కంటే బెటర్‌గా..
విశ్వ నటుడు కమలహాసన్ ఇంతకు ముందు నటించిన విశ్వరూపం చిత్రం పలు ఆవరోధాలను అధిగమించి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా కమలహాసన్ తెరకెక్కిస్తున్న విశ్వరూపం–2 చిత్రం కూడా ఆర్థిక సమస్యల వంటి పలు ఆటంకాలను ఎదుర్కొంది. కాగా అలాంటి వాటన్నింటిని చేధించుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం కమల్ తన తాజా చిత్రం శభాష్ నాయుడు చిత్రాన్ని పక్కన పెట్టి విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మరింత మెరుగులు దిద్దే పనిలో భాగంగా ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను స్థానిక పూందమల్లిలోని గోకుల్ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి తెలుపుతూ విడుదల తేదీ ఇంకా నిర్ణయంచలేదు గానీ, త్వరలోనే అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వరూపం చిత్రానికి మించి విశ్వరూపం–2 ఉంటుందని పేర్కొన్నారు. -
కమల్‌కి ఆమిర్ క్షమాపణ
‘‘ఒక చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ అయ్యాక, ఆ చిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లే’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ముంబయ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ‘ఫిక్కీ - ఫ్రేమ్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభం ఆమిర్‌ఖాన్, కమల్‌హాసన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాల గురించి ఆమిర్ మాట్లాడారు. వాటిలో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. దీని గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ - ‘‘కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ చిత్రాన్ని నిషేధించిన సమయంలో నా పనులతో నేను బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయాను. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, ఆ పని చేయడానికి నా వంతుగా నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నా. కమల్‌హాసన్‌కి సహాయం చేయలేకపోయినందుకు ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ‘కమల్‌గారూ! మీరు ఇబ్బందిలో ఉన్న సమయంలో మీ వెంట మేం లేకపోయినందుకు చాలా బాధపడుతున్నా’. సెన్సార్ ఆమోదం పొందిన ఏ చిత్రాన్నీ ఎవరూ నిషేధించకూడదు. అలాంటి నిషేధాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా’’ అన్నారు. -
నాలుగు పాత్రల్లో కనిపించబోతున్న మూర్తి
-
విశ్వరూపం
-
ఆండ్రియాతో కమల్ ప్రేమాయణం ?!
-
ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2
‘విశ్వరూపం’ విషయంలో కమల్‌హాసన్ అనుభవించిన స్ట్రగుల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా నిజంగా వివాదాల విశ్వరూపమే. అంత జరిగినా... వెనకంజ వేయకుండా ‘విశ్వరూపం-2’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు కమల్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిజానికి ‘విశ్వరూపం’ తీస్తున్నప్పుడే... ‘విశ్వరూపం-2’ చిత్రాన్ని కూడా 40 శాతం పూర్తి చేసేశారు కమల్. మిగిలిన 60 శాతాన్ని ఇటీవలే పూర్తి చేసేశారు. గిబ్రన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని ఈ నెలలోనే విడుదల చేసి, మార్చిలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే... ‘విశ్వరూపం’ చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు కాగా, ‘విశ్వరూపం-2’ చిత్రం నిడివి మూడు గంటల పైనే ఉంటుందట. తొలిభాగంలోని కొన్ని సన్నివేశాలు వివాదాలకు కారణమవడాన్ని దృష్టిలోపెట్టుకొని రెండో భాగం విషయంలో కమల్ జాగ్రత్త వహించినట్లు వినికిడి. ‘విశ్వరూపం-2’లో కూడా వివాదాస్పద అంశాలున్నప్పటికీ అవి ఎవరినీ నొప్పించేలా ఉండవని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘విశ్వరూపం’ చిత్రం మొత్తం దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే... ‘విశ్వరూపం-2’ని మాత్రం పూర్తిగా మనదేశంలోనే తీశారు కమల్. ఊహకందని అంశాలెన్నో ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. -
అదే జరిగితే...విదేశాల్లో స్థిరపడతాను!
‘‘ఏ దేశం వెళ్లినా నా మాతృదేశాన్ని మర్చిపోను. ఈ దేశం పట్ల నాకున్న సెంటిమెంట్స్, నా భాష, నా సంస్కృతీ సంప్రదాయాల్లో మార్పు రాదు’’ అంటున్నారు కమల్‌హాసన్. ప్రయోగాలకు చిరునామా అనే విధంగా ఎన్నో విభిన్న పాత్రలు చేసి, భారతీయ నటుల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారాయన. అలాంటి కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విడుదల అప్పుడు, ‘నన్ను ఇంకా ఇబ్బందులపాలు చేస్తే, వేరే రాష్ట్రానికి వెళ్లిపోతా.. లేకపోతే వేరే దేశానికే వెళ్లిపోతా’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘విశ్వరూపం 2’ చేస్తున్నారు. దర్శకత్వం, నటన.. ఇలా ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తూ కమల్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ తొలి భాగానికి వచ్చినట్లే, ఈ మలి భాగానికీ సమస్యలు ఎదురైతే అప్పుడేం చేస్తారు? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడూ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. స్వదేశం వదిలి విదేశాల్లో స్థిరపడతా. నేను కళాకారుణ్ణి. ఎమ్ఎఫ్ హుస్సేన్ చేసినట్లుగా వేరే ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోతా. ఇది బెదిరింపు కాదు.. రాజీనామా’’ అన్నారు ఉద్వేగంగా. -
కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్
బహుభాషా నటుడు కమల్ హసన్ నటిస్తూ, రూపొందిస్తున్న 'విశ్వరూపం 2’ చిత్ర ట్రైలర్ ను ఆయన జన్మదినం నవంబర 7 తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఆయన జన్మదినం రోజునే విశ్వరూపం ట్రైలర్‌ను ఆరో 3డిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ముందే విడుదల చేయాలనుకున్నాం. కొంత ఎడిటింగ్ పూర్తికావడంలో ఆలస్యమైంది.అందుచేత కమల్ జన్మదినం రోజున ట్రైలర్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు. -
బుల్లితెరకు ‘విశ్వరూపం 2’
థియేటర్లో విడుదలైన రోజున అదే సినిమా బుల్లితెరపై కూడా ప్రసారమైతే.. ఎలా ఉంటుంది? ఇంటిల్లిపాదీ హాయిగా ఆ సినిమాని ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. కానీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య సంగతేంటి?... ఇదే విషయం గురించి దాదాపు నాలుగైదు నెలల క్రితం భారీ ఎత్తున చర్చలు జరిగాయి. ఆ చర్చలకు కారణం కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘డీటీహెచ్’లో (డెరైక్ట్ టు హోమ్) విడుదల చేస్తానని కమల్ ప్రకటించగానే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. థియేటర్లో విడుదల చేసిన రోజునే టీవీల్లో సినిమా వచ్చేస్తే మా గతేం కాను అంటూ తమిళనాడులోని ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆ రకంగా డీటీహెచ్కి బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు ‘విశ్వరూపం 2’ని ఈ విధానం ద్వారా విడుదల చేయాలని కమల్ అనుకుంటున్నారట. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే యూఎస్‌లో అయినా ఈ విధానంలో విడుదల చేయాలన్నది కమల్ నిర్ణయం. మరి.. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘విశ్వరూపం 2’ విడుదలయ్యే అవకాశం ఉంది. -
గీత స్మరణం
పల్లవి : నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు (2) అది మీరే మీరే వూస్టారు వూ దేవుడు మీరే వూస్టారు (2) ॥ చరణం : 1 దారే దొరకని చీకటిలో... తానే వెలుగై నడిచాడు జాతే నా వెలుగన్నాడు జాతిపిత... వున జాతిపిత దిక్కులు తెలియుని సవుయుంలో తానే దిక్కుగ నిలిచాడు... శాంతిని నేతగ నిలిపాడు శాంతిదూత వున శాంతిదూత ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిగాడు ఆ శాంతిదూత నెహ్రూజీ మీలో వెలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు వూ దేవుడు మీరే వూస్టారు (2) ॥ చరణం : 2 జరిగే జీవిత సవురంలో... జారే నైతిక విలువల్లో నీతిని నేతగ నిలపాలి నవయుువత యుువనేత చుక్కలు వూడే గుండెల్లో ... నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగ నిలపాలి నవయుువత యుువనేత ఈ యుువత తాత గాంధీజీ మీలో మిగిలారు మీ నవతకు నేతాజీ మీలో రగిలారు అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు ॥ చిత్రం : విశ్వరూపం (1981), రచన : దాసరి నారాయుణరావు సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు, బృందం