కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్ | 'Vishwaroopam 2' trailer on Kamal Haasan's b'day likely | Sakshi
Sakshi News home page

కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్

Published Sun, Oct 27 2013 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్

కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్

బహుభాషా నటుడు కమల్ హసన్ నటిస్తూ, రూపొందిస్తున్న 'విశ్వరూపం 2’ చిత్ర ట్రైలర్ ను ఆయన జన్మదినం నవంబర 7 తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఆయన జన్మదినం రోజునే విశ్వరూపం ట్రైలర్‌ను ఆరో 3డిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 
 ట్రైలర్ ముందే విడుదల చేయాలనుకున్నాం. కొంత ఎడిటింగ్ పూర్తికావడంలో ఆలస్యమైంది.అందుచేత కమల్ జన్మదినం రోజున ట్రైలర్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
 విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement