ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2 | Kamal Haasan's Vishwaroopam 2 is completed | Sakshi
Sakshi News home page

ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2

Published Tue, Feb 11 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2

ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2

 ‘విశ్వరూపం’ విషయంలో కమల్‌హాసన్ అనుభవించిన స్ట్రగుల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా నిజంగా వివాదాల విశ్వరూపమే. అంత జరిగినా... వెనకంజ వేయకుండా ‘విశ్వరూపం-2’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు కమల్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిజానికి ‘విశ్వరూపం’ తీస్తున్నప్పుడే... ‘విశ్వరూపం-2’ చిత్రాన్ని కూడా 40 శాతం పూర్తి చేసేశారు కమల్. మిగిలిన 60  శాతాన్ని ఇటీవలే పూర్తి చేసేశారు. గిబ్రన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని ఈ నెలలోనే విడుదల చేసి, మార్చిలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
 
  మరో విషయం ఏంటంటే... ‘విశ్వరూపం’ చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు కాగా, ‘విశ్వరూపం-2’ చిత్రం నిడివి మూడు గంటల పైనే ఉంటుందట. తొలిభాగంలోని కొన్ని సన్నివేశాలు వివాదాలకు కారణమవడాన్ని దృష్టిలోపెట్టుకొని రెండో భాగం విషయంలో కమల్ జాగ్రత్త వహించినట్లు వినికిడి. ‘విశ్వరూపం-2’లో కూడా వివాదాస్పద అంశాలున్నప్పటికీ అవి ఎవరినీ నొప్పించేలా ఉండవని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘విశ్వరూపం’ చిత్రం మొత్తం దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే... ‘విశ్వరూపం-2’ని మాత్రం పూర్తిగా మనదేశంలోనే తీశారు కమల్. ఊహకందని అంశాలెన్నో ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement