సాక్షి చెన్నై: ప్రజలకు వైద్యసేవలందించడానికి తన ఇంటినే ఆస్పత్రిగా మారుస్తానని ప్రముఖ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో కమల్ స్పందించారు. ఆయన ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటినే వైద్యశాలగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. దీని గురించి కమల్‌హాసన్ బుధవారం తన ట్విటర్‌లో పేర్కొన్నారు. (ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!)
ఈ కష్టకాలంలో పేదలకు వైద్య సేవలందించడానికి మక్కళ్ నీది మయ్యంకు చెందిన వైద్యులను పిలిపించి తాను నివశించడానికి నిర్మించుకున్న భవనాన్ని తాత్కాలిక వైద్యశాలగా మార్చాలని భావిస్తున్నానన్నారు. అందుకు ప్రభుత్వం అనుమతిస్తే తన భవనాన్ని వైద్యశాలగా మార్చడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా సినిమాలు రద్దు కావడంతో దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. కమల్ కూడా రూ.10 లక్షలను ఫెఫ్సీకి అందించారు. (డేంజర్ బెల్స్!)
Comments
Please login to add a commentAdd a comment