Film Employees Federation of South India
-
కొత్త రూల్స్.. తమిళనాడులోనే షూటింగ్.. తమిళులకే ఛాన్స్!
తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు. అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు. షూటింగ్లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. FEFSI - Film employee's federation of south India new rules 1. For Tamil films only Tamil artists should be employed. 2. Shooting of films should happen only in Tamil Nadu. 3. Shoot should not take place in outside state or outside country without utmost necessity. 4. If… pic.twitter.com/Drno33OSX5 — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 చదవండి: ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ రిలీజ్ -
ఫెఫ్సీకి లైకా ప్రొడక్షన్స్ భారీ విరాళం
తమిళసినిమా: కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగా ఉంది. లాక్డౌన్ వళ్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ కష్ట సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. దక్షిణాదికి చెందిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు లైకా ప్రొడక్షన్స్ రూ.కోటి విరాళాన్ని అందించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి తమిళ కుమరన్, సంస్థ డైరక్టర్ రాజా సుందరం నిరుదన్, గౌరవ్ ఛ్చరా, సుబ్బునారాయణన్ స్థానిక వడపళనిలో సమాఖ్య అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి సోమవారం చెక్కును అందజేశారు. -
31 వరకు సినీ, టీవీ షూటింగ్స్ రద్దు.. అజిత్ 10 లక్షలు విరాళం
సాక్షి, చెన్నై: ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు నిర్వహించబోమని, కార్మికులను ప్రముఖ తారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ ప్రాణాంతకంగా మారడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ఆర్కే సెల్వమణి శనివారం వడపళని లోని ఫెఫ్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 18 టీవీ సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయని, వాటిని ఆదివారం నుంచి నిలిపి వేయనున్నట్టు పేర్కొన్నారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖ నటీనటులు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. -
ఫెఫ్సీకి నటి కాజల్ సాయం
కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు పనిలేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. సినిమా పరిశ్రమ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రోజువారీ వేతనాల కార్మికులైన దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన సభ్యులు, సహాయ నటీనటులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఇటీవల నటి నయనతార ఫెఫ్సీ సభ్యులను ఆదుకునే విధంగా రూ.20 లక్షల సాయం అందించారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ ఫెఫ్సీకి రూ.2 లక్షలు సాయం అందించారు. ఈమె తెలుగు సినీ కార్మికులకు రూ.2 లక్షలు సాయం చేశారు. ప్రధానమంత్రి సహయనిధికి లక్ష రూపాయలను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో లక్ష రూపాయలను అందించారు. ముంబయిలో తాను నివసిస్తున్న ప్రాంతంలోని ప్రజలకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. పెటాతో కలిసి మూగజీవులకు ఆహారాన్ని సమకూర్చుతున్నారు. నటుడు, నృత్య దర్శకుడు లారెన్స్ నడిగర్ సంఘంకు రూ.25 లక్షలు విరాళం అందించారు. -
ఫెఫ్సీకి కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ రూ. 12 కోట్ల విరాళం
తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వారికి సాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ సంస్థలు సంయుక్తంగా కలిసి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) సభ్యులను ఆదుకునే విధంగా రూ. 12 కోట్లను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఫెఫ్సీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖుషీతో, నటుడు ప్రభు సహకారంతో సోనీ టీవీ, కల్యాణి జువెలర్స్ సంస్థలు ఫెఫ్సీకి రూ. 12 కోట్లను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ. 2 కోట్ల 70 లక్షలను సినీ కార్మికుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సంఘ సభ్యులు 1800 మందికి తలా రూ. 1,500 విలువ చేసే బిగ్ బజార్ కూపన్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య కార్యదర్శి, దర్శకుడు ఉన్నికృష్ణన్‌కు కల్యాణి జువెలర్స్, సోనీ టీవీ సంస్థలకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
నా ఇంటినే ఆస్పత్రిగా మారుస్తా
సాక్షి చెన్నై: ప్రజలకు వైద్యసేవలందించడానికి తన ఇంటినే ఆస్పత్రిగా మారుస్తానని ప్రముఖ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో కమల్ స్పందించారు. ఆయన ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటినే వైద్యశాలగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. దీని గురించి కమల్‌హాసన్ బుధవారం తన ట్విటర్లో పేర్కొన్నారు. (ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!) ఈ కష్టకాలంలో పేదలకు వైద్య సేవలందించడానికి మక్కళ్ నీది మయ్యంకు చెందిన వైద్యులను పిలిపించి తాను నివశించడానికి నిర్మించుకున్న భవనాన్ని తాత్కాలిక వైద్యశాలగా మార్చాలని భావిస్తున్నానన్నారు. అందుకు ప్రభుత్వం అనుమతిస్తే తన భవనాన్ని వైద్యశాలగా మార్చడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా సినిమాలు రద్దు కావడంతో దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. కమల్ కూడా రూ.10 లక్షలను ఫెఫ్సీకి అందించారు. (డేంజర్ బెల్స్!) -
కష్టాల్లో కళాకారులు..రజనీకాంత్ భారీ విరాళం
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు వాయిదా పడడంతో సిని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది హీరోలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి : కరోనా కట్టడికి నితిన్ విరాళం) కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న సినికార్మికులకు రూ. 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ‘ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సీ)’ సంస్థకు రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు అయన తెలిపారు. మిగిలిన రూ.10 లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హీరోలు సూర్య, కార్తి కలిపి రూ.10 లక్షలు ఫెప్సికి విరాళంగా ఇచ్చారు. (చదవండి : జీతాలను ముందుగానే చెల్లించేశా!) ఇక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించడానికి ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాను ఎదుర్కొవడానికి తనవంతుగా రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించారు. పేద కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్-జీవితా రాజశేఖర్ ప్రకటించారు. -
సయోధ్య దిశగా చర్చలు
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి దక్షణి భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) మధ్య వేతనాలు, తదితర అంశాలపై కొంత కాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా గత నెల ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఫెఫ్సీ సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. అయితే సమ్మె సరైన పరిష్కారం కాదన్న నటుడు రజనీకాంత్ హితవు మేరకు ఫెఫ్సీ ఆ సమ్మెను విరమించుకుంది. అయితే ఇటీవల ఫెఫ్పీకి వ్యతిరేకంగా కొత్త వారిని ఆహ్వానిస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటనలో పేర్కొనడంతో వారి నిర్ణయాన్ని ఖండిస్తూ ఫెఫ్సీ ఈ నెల ఒకటవ తేదీ నుంచి మళ్లీ సమ్మె బాట పట్టింది. అంతే కాదు నిర్మాతల మండలి చర్యలను ఖండిస్తూ ఐదవ తేదీన స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే సమ్మె కొనసాగుతున్నా ఆందోళన నిర్ణయాన్ని ఫెఫ్సీ విరమించుకుంటున్నట్లు మంగళవారం ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి వెల్లడించారు. సోమవారం సాయంత్రం తమిళనిర్మాతల మండలి నిర్వాహకులు ఫెఫ్సీ నిర్వాహకుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిగిన సమస్య ఒక కొలిక్కిరాలేదు. కాగా చర్చలు సయోద్య దిశగా సాగుతున్నాయని, ఫెఫ్సీ డిమాండ్లు నెరవేరబడతాయన్న ఆశాభావాన్ని ఈ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేస్తూ మంగళవారం నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. -
ఏ కారణంతోనూ షూటింగ్స్ ఆపం..!
పెరంబూరు: ఇకపై వేతనాల విషయంలోనే కాదు ఇతర ఎలాంటి కారణాలతోనూ షూటింగ్‌లను నిలిపివేసే ప్రయత్నాలు చేయమని దక్షిణ భారత సినీ కార్మికులు సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొద్ది రోజులుగా తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులకు, ఫెఫ్సీ నిర్వాహకులకు మధ్య వేతన విషయాల గురించి వివాదం జరుగుతోంది. దీంతో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ఫెఫ్సీకి చెందిన సభ్యులు లేకుండానే ఇతర కార్మికులతో షూటింగ్‌లు చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆయనకు వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి.ఈ విషయమై విశాల్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇకపై ఫెఫ్సీ సభ్యులెవరూ వేతనాలు విషయాల్లో షూటింగ్‌లను అడ్డుకోరని తెలిపారు. అదేవిధంగా ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్, విశాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నాని అన్నారు. ఇకపై నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మద్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా, నిర్మాతల మండలి, నడిగర్‌సంఘం, దర్శకుల సంఘాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామని తెలిపారు.అదే విధంగా విశాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫెఫ్సీ సభ్యుడు ధనపాల్ ఈ సందర్భంగా పత్రికాముఖంగా ఆయనకు క్షమాపణ చెప్పారు.