కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు పనిలేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. సినిమా పరిశ్రమ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రోజువారీ వేతనాల కార్మికులైన దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన సభ్యులు, సహాయ నటీనటులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఇటీవల నటి నయనతార ఫెఫ్సీ సభ్యులను ఆదుకునే విధంగా రూ.20 లక్షల సాయం అందించారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ ఫెఫ్సీకి రూ.2 లక్షలు సాయం అందించారు. ఈమె తెలుగు సినీ కార్మికులకు రూ.2 లక్షలు సాయం చేశారు.
ప్రధానమంత్రి సహయనిధికి లక్ష రూపాయలను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో లక్ష రూపాయలను అందించారు. ముంబయిలో తాను నివసిస్తున్న ప్రాంతంలోని ప్రజలకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. పెటాతో కలిసి మూగజీవులకు ఆహారాన్ని సమకూర్చుతున్నారు. నటుడు, నృత్య దర్శకుడు లారెన్స్ నడిగర్ సంఘంకు రూ.25 లక్షలు విరాళం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment