తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.. ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు న్యాయ సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, సభలో ఎవరికి మెజార్టీ ఉంటే వారినే సీఎంను చేయాలని గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. అసెంబ్లీలో ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది సభ సాక్షిగా తేలాలని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాసాగర్ రావుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.