Attorney General Mukul rohatgi
-
ఇక తప్పుకుంటా: ముకుల్ రోహత్గీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి ముకుల్ రోహత్గీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అటార్నీ జనరల్‌గా కొనసాగే ఉద్దేశంకానీ, ఆసక్తిగానీ తనకు లేవని స్పష్టం చేశారు. పదవీకాలాన్ని పొగడించాల్సిందిగా ప్రభుత్వాన్ని తాను కోరలేదని వివరించారు. ఏజీ ముకుల్ రోహత్గీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ సహా ఐదుగురు న్యాయాధికారుల పదవీకాలాన్ని పొగిడిస్తూ జూన్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహత్గీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘వాజపేయి హయాంలో ముఖ్యబాధ్యతలు నిర్వర్తించా. నరేంద్ర మోదీ హయాంలో మూడేళ్లపాటు ఏజీగా కొనసాగా. ఇకపై ఆ పదవిలో కొనసాగాలని లేదు. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నది నా అభిమతం. అందుకే సర్వీస్ ఎక్స్టెన్షన్ కోరలేదు. ఇప్పటి ప్రభుత్వంతో నాకు సత్సంబంధాలున్నాయి. అందుకే ఇక తప్పుకుంటానని లేఖరాశా’ అని రోహత్గీ వివరించారు. 2014 జూన్ 19న భారత ప్రధాన న్యాయాధికారి(అడ్వకేట్ జనరల్)గా ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టారు. ఆయన సర్వీసును పొగడిస్తూ గత వారం ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ.. ఎంత కాలం వరకు రోహత్గీ ఏజీ పదవిలో కొనసాగుతారో మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. రోహత్గీ తాజా లేఖపై కేంద్రం స్పందించాల్సిఉంది. -
వారంలోగా బలపరీక్ష!
గవర్నర్‌కు అటార్నీ జనరల్ సూచన సాక్షి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు వారం రోజుల్లో ముగింపు పడనుంది. ముఖ్యమంత్రి పీఠంకోసం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తలపడుతున్న నేపథ్యంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు వారం రోజులుగా నిర్ణయం ప్రకటించని విషయం తెలిసిందే. శశికళకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా ఆమె సంతకాలతో కూడిన పత్రాలు సమర్పించినప్పటికీ, ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేపథ్యంలో గవర్నర్ తర్జన భర్జన పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఆయన సోమవారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని రోహత్గీ సూచించినట్లు తెలిసింది. అప్పుడు శాసనసభ సాక్షిగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపు ఉన్నారో స్పష్టమవుతుందని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్, కల్యాణ్సింగ్ల మధ్య ఇలాంటి వివాదమే నెలకొన్నప్పుడు సభలో బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు. మరోవైపు శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. ఆ తీర్పును అనుసరించి గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా వారం రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడి, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోతుందని భావిస్తున్నారు. -
గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్?
-
మళ్లీ వేలం వేస్తాం!
* బొగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకు కేంద్రం వివరణ * 40 గనులకు మాత్రం రద్దు నుంచి మినహాయింపు కోరిన ఏజీ న్యూఢిల్లీ: 1993- 2010 మధ్య జరిగిన అన్ని బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేస్తే.. వాటిని మళ్లీ వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 1993 నుంచి 2010 వరకు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అడ్డగోలుగా, అక్రమంగా జరిగాయని ఆగస్టు 25న సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు. ‘బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి ఆగస్ట్ 25 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగా మొత్తం 218 బొగ్గు క్షేత్రాలను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వాటిలో నుంచి విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా.. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 40 బొగ్గు గనులకు రద్దు నుంచి మినహాయింపునిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది’ అని రోహత్గీ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి స్పష్టం చేశారు. అయితే, అన్ని కేటాయింపులూ చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు స్పష్టం చేసినందువల్ల.. ఆ తీర్పు ప్రకారమే వెళ్లాలనుకుంటే అన్ని కేటాయింపులను రద్దు చేసి తాజాగా వేలం వేయాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలను సమీక్షించేందుకు మాజీ న్యాయమూర్తితో కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని రోహత్గీ స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. సెప్టెంబర్ 8 లోగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కోల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, స్పాంజ్ ఐరన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలతో పాటు పిటిషనర్లను ఆదేశించింది. బొగ్గు గనుల కేటాయింపు అంశంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నందున, ఆగస్ట్ 25 నాటి తీర్పును వ్యక్తుల నేరసంబంధ అంశాల జోలికి వెళ్లకుండా.. చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తతతో ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు విచారణలో తనకు సహకరించేందుకు ముగ్గురు సీనియర్ సీబీఐ ప్రాసిక్యూటర్లను నియమించాలన్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ చీమా అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వీకే శర్మ, సంజయ్‌కుమార్, ఏపీ సింగ్‌లకు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. ఆ క్లోజర్ రిపోర్ట్ నిర్హేతుకం కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై, ఆ సంస్థ డెరైక్టర్లపై బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించిన కేసులను మూసేయాలం టూ సీబీఐ రూపొందించిన ముగింపు నివేదిక(క్లోజర్ రిపోర్ట్)ను ప్రత్యేక కోర్టు సోమవారం తీవ్రంగా ఆక్షేపించింది. ఆ నివేదిక అసంబద్ధం గా, తర్కదూరంగా ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశ్కర్ తప్పుపట్టారు.