
పన్నీరు తప్ప ఎమ్మెల్యేలందరూ మావైపే
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నా డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. పన్నీరు సెల్వం తప్ప పార్టీకి చెందిన మిగతా 134 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పారు.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించడంపై తంబిదురై స్పందిస్తూ.. చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. పన్నీరు సెల్వానికి ఇక పార్టీతో సంబంధం లేదని చెప్పారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
లొంగిపోయిన చిన్నమ్మ
వీడని ఉత్కంఠ
ఇక అమ్మ ఫొటో కనిపించదా
పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ
ఆచితూచి అడుగులు
మద్దతు కాదు కృతజ్ఞతే!