
సాక్షి, చెన్నై: రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురైకు బుధవారం గుండెనొప్పి వచ్చింది. ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తంబిదురైకి యాంజియోగ్రామ్ చికిత్స అందించారు. ప్రస్తుతం తంబిదురై ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.