చెన్నై: రాష్ట్రంలో వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్న శశికళ, దివాకరన్ ఏకమవుతున్నట్లు ఆదివారం ఓ వార్త ఆసక్తి కలిగించింది. శశికళ సోదరుడు దివాకరన్, అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న విబేధాల నుంచి కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీ ప్రారంభమైంది.
రెండు పార్టీల్లో పెద్దగా బలం, బలగం లేకున్నా వారివురూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ వర్గం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకేలో అన్నా ద్రవిడ కళగం విలీనం కాబోతున్నట్లు, ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన తంజావూరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నాడేఎంకేలో పన్నీర్ సెల్వం వెర్సస్ పళణి స్వామి అన్నట్లు రాజకీయ వివాదం జరుగుతోంది. మరో వైపు శశికళ నాయకత్వంలోని పార్టీకి ఈ వీలినం చూస్తుంటే అన్నాడేఎంకేలో పట్టు బిగించే పనిలో ఆమె దృష్టి పెట్టినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment