Sasikalaa
-
మద్దతుదారులతో చిన్నమ్మ మంతనాలు.. టార్గెట్ అదే!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తన మద్దతు దారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తేలేదని పేర్కొనడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేలో చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి టీం బలంగా ఉంది. పన్నీరు సెల్వం శిబిరం ఆ తర్వాతి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ బలోపేతమే లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. ఇక అన్నాడీఎంకేకు తానే ప్రధాన కార్యదర్శి అని, కోర్టు తీర్పు సైతం తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశతో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఉన్నారు. అన్నాడీఎంకేలోని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఆమె పదేపదే పిలుపునిస్తున్నా స్పందించే వాళ్లు కరువయ్యారు. గత వారం జరిగిన పన్నీరు శిబిరం సమావేశంలో గానీయండి, మంగళవారం జరిగిన పళనిస్వామి శిబిరం సమావేశంలో కానీయండి ఎవరికి వారు పార్టీని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకునే వ్యూహంతో ఉండడంతో చిన్నమ్మ సైతం స్పందించారు. తన మద్దతు దారులతో కలిసి తనదైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. బుధవారం చెన్నైలో మద్దతు నాయకులందరిని పిలిపించి తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. లోక్ సభ ఎన్నికలలోపు అన్నాడీఎంకేలో ఉన్న వారందరీని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు, ప్రజలలోకి చొచ్చుకెళ్లి తన బలాన్ని మరింతగా పెంచుకునే విధంగా చిన్నమ్మ నిర్ణయాలు తీసుకున్నట్టు మద్దతు నేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిన్నమ్మ ప్రతినిధిగా అమ్మమక్కల్ మున్నేట్రకళగంకు నేతృత్వం వహిస్తున్న టీటీవీ దినకరన్ మీడియాతో స్పందిస్తూ, తాను అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని, తన బలాన్ని తాను చాటుకుంటానని పేర్కొనడం గమనార్హం. -
Duvvada Railway Station: శశికళ.. గుండె విలవిల
సాక్షి, తూర్పుగోదావరి: లేకలేక కలిగిన సంతానం ఆ అమ్మాయి. అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. విధి చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయి ప్రాణాలను హరించింది. అనకాపల్లి జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం గుంటూరు – రాయగడ∙ఎక్స్‌ప్రెస్ దిగుతూ జారి పడి, ప్లాట్‌ఫాం – రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయి.. గంటన్నర పాటు అంతులేని బాధ పడిన మెరపల శశికళ (22) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. శరీరం నలిగిపోయి అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె మృతి సమాచారం తెలియడంతో అన్నవరం వెలంపేటలో విషాద ఛాయలు అలముకొ న్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి కుమార్తె శశికళ చిన్నప్పటి నుంచీ చదువులో దిట్ట. బొమ్మలేయడంలో కూడా మంచి ప్రతిభ ప్రదర్శించేది. తుని ఆదిత్యలో బీసీఏ చదివింది. గత నెలలో దువ్వాడ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంసీఏ కోర్సులో చేరింది. రోజూ అన్నవరం నుంచి దువ్వాడ వరకూ రైలులో వెళ్లి వచ్చేది. ఇలా తిరగడం ఇబ్బందిగా ఉందని, హాస్టల్లో ఉంటానని ఇంట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం బయలుదేరి వెళ్లిన శశికళ దువ్వాడలో ట్రైన్ నుంచి జారి పడిపోయింది. కిందకు దిగే ప్రయత్నంలో రైలు కుదుపునకు బోగీ తలుపు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో శశికళ అదుపు తప్పి పడిపోయిందని సమాచారం. ఆమె మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బంధువులు విశాఖ బయలుదేరారు. తల్లితండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం శశికళ మృతదేహాన్ని గురువారం రాత్రి అన్నవరం తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి, పుట్టెడు దుఃఖంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున విలపించారు. శశికళ మృతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి) -
దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. దువ్వాడ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన మెరపల శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లడానికి బుధవారం ఉదయం ఆమె గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. దువ్వాడ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోవడంతో ఆమె దిగే ప్రయత్నంలో కాలుజారి ప్లాట్‌ఫామ్, రైలు బోగీ మధ్యలో ఇరుక్కుపోయింది. రైలు నిలిపేసి ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయచినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆపరేటింగ్ సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల రెక్టార్ వి.మధుసూదనరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.మధుసూదనరావు అక్కడికి చేరుకుని గంటన్నరపాటు శ్రమించి ప్లాట్‌ఫామ్‌ను తవ్వించి ఆమెను బయటకు తీశారు. అంబులెన్స్‌లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిన్నటి నుంచి ఐసీయూలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న శశికళ ఇవాళ తుదిశ్వాస విడిచింది. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ
సాక్షి, చెన్నై: తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు. తాటాకు చప్పళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. దివంగత సీఎం జయలలిత మృతి మిస్టరీపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సమరి్పంచిన నివేదిక రెండు రోజుల క్రితం అసెంబ్లీకి చేరిన విషయం తెలిసిందే. ఇందులోని అంశాలన్నీ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. ఆమెతో పాటు మాజీ సీఎస్ రామ్మోహన్రావు, మాజీ మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురి వద్ద సమగ్ర విచారణకు కమిషన్ సిఫార్సు చేసింది. ప్రధానంగా అమ్మ మృతి మిస్టరీని కమిషన్ విచారణలో తేలనప్పటికీ, శశికళను టార్గెట్ చేస్తూ పేర్కొన్న అంశాలు చర్చకు దారి తీశాయి. ఆమెను విచారణలోకి తెచ్చేందుకు ప్రత్యేక సిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వ్యూహాలపై శశికళ స్పందించారు. శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎంకేది కక్షసాధింపు ధోరణి డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. రైతులు కన్నీటి మడుగులో మునిగి ఉన్నారని, విద్యుత్ చార్జీల పెంపు, ఆస్తి పన్ను, వాట ర్ట్యాక్స్ పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షాల రూపంలో గ్రామాలు నీట మునిగాయని, వాటి గురించి పట్టించుకోవడం లేద ని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు పక్కదారి పట్టించేందుకు తనను ఈ పాలకులు టార్గెట్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియక ఈ పాలకులు తికమక పడుతున్నారని విమర్శించారు. తాను ఈ పాలకులను ప్రశి్నస్తూనే ఉంటానని, ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో రాజకీయాల్లోకి వచ్చానని, కాకమ్మ బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. డీఎంకే ప్రభుత్వం పతనం లక్ష్యంగా, తమిళ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నిందితులను శిక్షించాలి ఆర్ముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలపై జయలలిత మేనకోడలు దీపా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం మేనత్త జయలలితకు శశికళ సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని కోరారు. జయలలిత మరణం వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందరికి సంబంధాలు ఉన్నాయో వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దీపా కోరారు. -
దూకుడు పెంచిన శశికళ.. వారితో దోస్తి!
చెన్నై: రాష్ట్రంలో వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్న శశికళ, దివాకరన్ ఏకమవుతున్నట్లు ఆదివారం ఓ వార్త ఆసక్తి కలిగించింది. శశికళ సోదరుడు దివాకరన్, అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న విబేధాల నుంచి కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీ ప్రారంభమైంది. రెండు పార్టీల్లో పెద్దగా బలం, బలగం లేకున్నా వారివురూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ వర్గం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకేలో అన్నా ద్రవిడ కళగం విలీనం కాబోతున్నట్లు, ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన తంజావూరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నాడేఎంకేలో పన్నీర్ సెల్వం వెర్సస్ పళణి స్వామి అన్నట్లు రాజకీయ వివాదం జరుగుతోంది. మరో వైపు శశికళ నాయకత్వంలోని పార్టీకి ఈ వీలినం చూస్తుంటే అన్నాడేఎంకేలో పట్టు బిగించే పనిలో ఆమె దృష్టి పెట్టినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: OPS Vs EPS: పన్నీర్ సెల్వానికి షాక్.. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
టోల్గేట్ సిబ్బందిపై 'చిన్నమ్మ' ఫైర్
చెన్నై : చిన్నమ్మ శశికళకు కోపం వచ్చింది. టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ రోడ్డుపై నిరసనకు దిగారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పురట్చి పయనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తృతంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ, మద్దతుదారుల్ని ఏకం చేస్తూ, తన బలాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి విల్లుపురం పర్యటన ముగించుకుని తిరుచ్చి వైపుగా బయలు దేరి వెళ్లారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వాహనాలతో కూడిన ఆమె ప్రైవేట్ కాన్వాయ్ తిరుచ్చి తువ్వాకుడి టోల్ గేట్‌కు చేరుకుంది. ముందుగా వెళ్లున్న వాహనం టోల్ ‘గేట్’ను దాటింది. అయితే, చిన్నమ్మ వాహనానికి అడ్డుగా గేట్ పడటంతో వివాదం రేగింది. ఆమె ఉన్న వాహనం అద్దాలను తాకుతూ గేట్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే టోల్ గేట్లో తనకు రెండుసార్లు అవమానం జరిగిందని, మరో మారు అదే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మద్దతుదారులు సైతం తగ్గేది లేదంటూ వాహనాలను రోడ్డు మధ్యలో ఆపేశారు. నిరసన.. బుజ్జగింపులు చిన్నమ్మ మద్దతుదారులు ఒక్క సారిగా టోల్గేట్ వైపు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది ప్రాణభయంతో పారిపోయారు. దీంతో టోల్లోని అన్ని గేట్లు మూత పడ్డాయి. వాహనాలు బారులు తీరడమే కాకుండా, కారులో నుంచి చిన్నమ్మ శశికళ నిరసనకు దిగారు. ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి చిన్నమ్మను, ఆమె మద్దతు దారులను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టోల్ గేట్ మేనేజర్ అమర్నాథ్ చిన్నమ్మకు క్షమాపణలు చెప్పినా చిన్నమ్మలో ఆగ్రహం తగ్గలేదు. తనపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొనడంతో చిన్నమ్మ శాంతించారు. గంట తర్వాత ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. ఇదీ చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
చిన్నమ్మకు చెక్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోకుండా చిన్నమ్మ శశికళకు చెక్‌పెట్టాలని, ఆమె సాగిస్తున్న రహస్య పన్నాగాలను తిప్పికొట్టాలని ఆ పార్టీ రథసారథులు ఓ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెలాఖరులో పార్టీ జనరల్ బాడీ సమావేశం సన్నాహాల్లో భాగంగా చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మంగళవారం విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఐదేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2019లో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రబలుతున్నందున అప్పట్లో ఎన్నిక లు నిర్వహించలేదు. 2021 ద్వితీయార్థంలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అదే ఏడాది డిసెంబర్లో పార్టీ నిర్వాహకులు, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ పదవులకు ఎన్నికలు ముగించారు. ఈ పదవులను జనరల్‌బాడీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం ఈనెల 23వ తేదీన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి జిల్లా కార్యదర్శులకు, ఉప కార్యదర్శులకు, కార్యవర్గ నిర్వాహకులకు ఇంత వరకు ఆహ్వానాలు అందలేదు. ప్రత్యేక ఆహ్వానితులను సైతం జనరల్ బాడీ సమావేశంలో భాగస్వాములను చేయాలని పన్నీర్‌సెల్వం ఒత్తిడి చేస్తుండగా, ఎడపాడి ఇందుకు అంగీకరించలేదు. జనరల్ బాడీ సమావేశానికి శశికళ మద్దతుదారులు, నకిలీ సభ్యులు హాజరై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఎడపాడి అనుమానించడం వల్లనే అంగీకరించడం లేదనే వాదన ఉంది. ఏదో విధంగా పార్టీలోకి జొరబడేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాని జిల్లా కార్యదర్శులను ఇప్పటికే ఎడపాడి ఆదేశించారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే వ్యూహం తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఈ సమావేశంలో చేసినట్లు సమాచారం. చదవండి: వామ్మో.. భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫట్! -
చిన్నమ్మ మెడకు ‘లగ్జరీ’ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసినా చిన్నమ్మ శశికళను కారాగారం నీడ వెంటాడుతూనే ఉంది. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సమయంలో లగ్జరీ జీవితం కోసం రూ.2 కోట్లు లంచం ఎరవేసిన వ్యవహారం రుజువై చిన్నమ్మ మెడకు బిగుసుకుంటోంది. వివరాలు.. తమిళనాడులో 1991–96 మధ్యకాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అప్పటి సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నలుగురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జయ మరణం తరువాత 2017 ఫిబ్రవరి 15వ తేదీన తుదితీర్పు వెలువడింది. దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాకాలాన్ని పూర్తిచేసుకుని విడులయ్యారు. బెంగళూరు జైల్లో శశికళ సాధారణ ఖైదీలాగ కాకుండా లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించడం, ఇళవరసితో కలిసి బెంగళూరులో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వారికి ఈ వెసులుబాటు కల్పించిన జైలు ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది. డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయ్యాయి. కాగా చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్ట్ 25న తొలివిడత చార్జిషీటు దాఖలైంది. ఈ కేసు కర్ణాటక హైకోర్టులో బుధవారం మరోసారి విచారణ వచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ హాజరై జైలు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా తుది చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈకేసుపై త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. -
శశికళ చట్టానికి చిక్కేనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శశికళపై చట్టపరమైన చర్యలకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఈ విషయమై ఆపార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసుశాఖ న్యాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. అయితే చట్టం ఉచ్చులో ఆమె చిక్కక తప్పదని అన్నాడీఎంకే న్యాయనిపుణులు, సాధ్యం కాదని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు. జయ మరణం తరువాత చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల వల్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, పార్టీ అగ్రనేతలంతా కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద శశికళ, దినకరన్ చేసిన పోరు చివరికి విఫలమైంది. పన్నీర్, ఎడపాడి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం సొంతమని ఢిల్లీ హైకోర్టు సైతం అప్పట్లో తీర్పు చెప్పింది. దీంతో టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించి శశికళ కనుసన్నల్లోనే నడిపించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలునుంచి విడుదలైన శశికళ కొద్దినెలలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా మెలిగినా ఇటీవల మరలా దూకుడు ప్రదర్శించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం) స్వర్ణోత్సవాల వేళ కలకలం అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీన శశికళ తన అనుచరవర్గంతో కలిసి హడావుడి చేశారు. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో చెన్నై మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్, జయసమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మరుసటి రోజున ఎంజీఆర్ స్మారక మందిరం వద్దకు చేరుకుని ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందులో ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ’ అని పొందుపరిచి ఉంది. అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ గృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శశికళ తీరు అన్నాడీఎంకే అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ హోదాను, పతాకాన్ని ఆమె అక్రమంగా వాడుకున్నారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. చెన్నై టీ నగర్లో శశికళ నివసిస్తున్నందున అదే పరిధిలోని మాంబళం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి జయకుమార్, పార్టీ న్యాయసలహాదారు బాబు మురుగవేల్‌తో కలిసి బుధవారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేని శశికళ చట్టవిరుద్ధంగా వ్యవహరించినందున తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను దిక్కరించిన శశికళపై చట్టపరమైన చర్యల సాధ్యాసాధ్యాలపై పోలీసు యంంత్రాగం న్యాయనిపుణులతో చర్చలు జరపడం ప్రారంభించింది. శశికళపై ఎఫ్ఐఆర్ నమోదు దిశగా పోలీస్‌శాఖ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యలను ఆమె న్యాయవాది రాజా సెందూర్పాండియన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆయన అన్నారు. న్యాయస్థానం ద్వారా శశికళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుందని అన్నాడీఎంకే న్యాయసలహాదారులు చెబుతున్నారు. చదవండి: (నటుడు శింబుపై భారీ కుట్రలు) ఎడపాడి దిష్టిబొమ్మ దహనం ఇదిలా ఉండగా, శశికళ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తిరునెల్వేలీ వన్నార్పేటలో ఆమె అభిమానులు అన్నాడీఎంకే పతాకాన్ని, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. 26 నుంచి చిన్నమ్మ పర్యటన అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సాగుతుండగా, చిన్నమ్మ శశికళ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా రాజకీయ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 26వ తేదీన తంజావూరులో తన పర్యటనకు శ్రీకారం చుట్టి వారం రోజులపాటూ దక్షిణ జిల్లాలను చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
అనంతగిరి: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన అనంతగిరి గుట్ట అడవిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులో చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన చెన్నయ్య(38), శశికళ దంపతులు, వీరికి పిల్లలు ప్రవీణ్, పావని ఉన్నారు. అయితే, చెన్నయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, ఆయన భార్యకు వరుసకు మరిది అయ్యే రమేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన చెన్నయ్య భార్యతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఈనేపథ్యంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని శశికళ భావించి పథకం వేసింది. అయితే, మద్యానికి బానిసైన చెన్నయ్యకు అనంతగిరిలో చెట్లమందు ఇస్తారని శశికళ, రమేష్ నమ్మబలికారు. ఈనెల 6న అతడిని వికారాబాద్‌కు బస్సులో తీసుకొచ్చారు. మార్గంమధ్యలో కూడా చెన్నయ్యకు మద్యం తాగించారు. అనంతరం అక్కడి నుంచి అనంతగిరికి చేరుకుని పథకం ప్రకారం చెన్నయ్యకు పూటుగా మరికొంత మద్యం తాగించారు. ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత వాటర్ ట్యాంకు సమీపంలోని ఘాట్ వద్ద ఒక్కసారిగా లోయలోకి తోసేసి అతడిపై రాళ్లు వేసి చంపేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా చెట్లకొమ్మలు, మట్టితో కప్పేశారు. నాలుగు రోజుల క్రితం తల్లి మృతి ఇదిలా ఉండగా చెన్నయ్య తల్లి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఒక్కగానొక్క కొడుకైన చెన్నయ్య కోసం సాయంత్రం వరకు ఎదురు చూసినా ఆయన జాడ లభించకపోవడంతో అదేరోజు సాయంత్రం వరకు చూసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివారం చెన్నయ్య తల్లి మూడు రోజుల కార్యక్రమం పూర్తయింది. అదేరోజు సాయంత్రం పలువురు బంధువులు చెన్నయ్య విషయమై భార్య శశికళను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అనుమానంతో రమేష్‌ను గ్రామపెద్దల సమక్షంలో నిలదీయగా అసలు విషయం బయట పెట్టాడు. గ్రామస్తులు, బంధువులు కలిసి మంగళవారం అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి వారిసాయంతో వికారాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రెండుఠాణాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. వివరాలు సేకరించి, అక్కడే పంచనామా చేశారు. కాగా, విషయం వెలుగుచూడటంతో శశికళ తన స్వగ్రామంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వైరలైన ఆగస్టు 14 ముహూర్తం..
రాష్ట్ర రాజకీయ తెరపై శశికళ మరోసారి తళుక్కుమన్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండానే ఆగస్ట్ 14వ తేదీన ముందుగానే విడుదల కానున్నారని జోరుగాప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శశికళకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలితకు అన్నీతానై 32 ఏళ్లపాటు నీడలా వెంట నిలవడమే ఇందుకు కారణం. జయ తీసుకునే పార్టీ పరమైన అన్ని నిర్ణయాల వెనుక శశికళ ప్రమేయం ఉంటుందని ప్రతీతి. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయాల్లో తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో ‘శశికళ వర్గం’ కూడా ఏర్పడింది. పైకి జయకు వీరవిధేయులుగా ఉంటూనే లోలోపల శశికళ బంటులుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు. అందుకే జయ కన్నుమూయగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలోమంటూ శశికళకు పాదాక్రాంతమైనారు. అమ్మ తరువాత ఇక చిన్నమ్మే శరణ్యమని పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్‌ను కలిసి ఇక సీఎం కావడమే తరువాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో జైలు పాలుకావడం జరిగిపోయింది. 2017 టూ 2021 ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు జీవితం ప్రారంభించిన శశికళకు నాలుగేళ్ల శిక్షా కాలం 2021 ఫిబ్రవరితో ముగుస్తుంది. దాదాపుగా ప్రతి ఖైదీ తన శిక్షా కాలంలో అనేక వెసులుబాటులు కలిగి ఉంటారు. విచారణ దశలో రిమాండ్ ఖైదీగా గడిపిన కాలం, సత్ఫ్రవర్తనతో శిక్షాకాలం నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన ఖైదీలను ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వాలు ముందుగా విడుదల చేస్తుంటాయి. శశికళ విషయానికి వస్తే రిమాండ్ ఖైదీగా జయలలితతోపాటు బెంగళూరు జైల్లో మూణ్ణాలుగు నెలలు గడిపి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రిమాండ్ కాలాన్ని శశికళ విషయంలో పరిగణనలోకి తీసుకుంటే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అది వీలుపడని పక్షంలో ఇక సత్ఫ్రవర్తన కింద పరిశీలించాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ‘చేతి’చలువతో జైలు గోడల మధ్య లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ములాఖత్, జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వెళుతూ బెంగళూరు నగరంలో షాపింగ్ చేయడం వంటివి శశికళ సాగించారని బెంగళూరు అప్పట్లో జైళ్లశాఖ డీఐజీ రూప సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. శశికళ షాపింగ్‌కు వెళ్లివస్తున్న సీసీటీవీ పుటేజీలు సైతం బహుళ ప్రచారంలోకి వచ్చాయి. వీటిని గనుక ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటే సత్ఫ్రవర్తన కోటా కింద శశికళకు ముందస్తు విడుదల యోగం ఉండదు.(జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు ) ఆగస్టు 14న విడుదలవుతున్నట్లుగా ప్రచారం సత్ఫ్రవర్తన కోటా కింద నాలుగేళ్ల జైలు శిక్ష ముగియకుండానే ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలవుతున్నట్లు ఒక సమాచారం వైరల్ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న శిక్షాఖైదీల్లో శశికళ కూడా ఉన్నారా అనే విషయం స్పష్టం చేయాలని కోరుతూ శశికళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఆశీర్వాదం ఆచారి.. సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా బదులురాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, సత్ఫ్రవర్తన కోటా కింద ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదల కానున్నారని ఆశీర్వాదం ఆచారి గురువారం ట్వీట్ చేసి కలకలాన్ని రేపారు. అంతేగాక రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చకు తెరలేపారు. వచ్చే ఏడాది (2021) ఏప్రిల్ లేదా మే మాసంలో తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో కీలకపాత్ర పోషించిన శశికళ చలువవల్లే ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అదే తరుణంలో శశికళపై తిరుగుబాటు చేసిన ఓ పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. నటులు కమల్, రజనీకాంత్ రాజకీయ పార్టీలను పక్కనపెడితే అన్నాడీఎంకే, డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల రణరంగంలో తలపడుతాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే శశికళ జైలు నుంచి విడుదలైతే అన్నాడీఎంకే రాజకీయాల్లో కుదుపుతప్పదు. ఈ పరిణామం అన్నాడీఎంకేకు అనుకూలమా ప్రతికూలమా అనేది అంచనాలకు అందని విధంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే దూకుడుకు కళ్లెం వేసేందుకు అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కమలనాథులు వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఎడపాడి ఎలాగూ విధేయుడు కాబట్టి శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వంల మధ్య రాజీకి బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యూహంపై రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అన్నాడీఎంకేలో ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలుసుకునేందుకే బీజేపీ అధిష్టానం ‘ట్రయల్ రన్’లా ఆశీర్వాదం ఆచారిచే ట్వీట్ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలనాథులు ఆశించినట్లుగానే శశికళ ముందస్తు విడుదల రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సత్ఫ్రవర్తన కింద శశికళ ముందుగా విడుదల కావాలంటే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపుపై చిక్కు సమస్య ఉంది. ఆస్తుల కేసులో శశికళతోపాటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్ కలిపి మొత్తం రూ.30 కోట్లు జరిమానా కట్టాలి. ఆ సొమ్ము కట్టిన పక్షంలో ఆదాయపు పన్నుశాఖ రంగప్రవేశం చేసి ఇంత సొమ్ము ఎక్కడిదని నిలదీస్తుంది. జరిమానా చెల్లించని పక్షంలో సత్ఫ్రవర్తన జాబితాలో చేరినా ముందస్తు విడుదలకు అవకాశం లేదు. అబ్బే అదేం లేదు : బెంగళూరు జైళ్లశాఖ ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలా, అబ్బే అదేం లేదని బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘సత్ఫ్రవర్తన కోటా కింద శిక్షా ఖైదీలను విడుదల చేయాలనే అంశంపై స్వాతంత్య్ర దినోత్సవానికి సుమారు పది రోజుల ముందు కర్ణాటక కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని గవర్నర్‌కు ఆమోదానికి పంపుతుంది. ఆ తరువాతనే ఖైదీలను విడుదల చేస్తార’ని జైళ్లశాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్ఫ్రవర్తన ఖైదీల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు సమావేశమే కాలేదని ఆయన స్పష్టం చేశారు. -
అమ్మ ఆస్తులకు కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకోసం కుమ్ములాట మొదలైంది. భాగస్వామిగా వ్యవహరించిన శశికళ, అన్నకుమార్తె దీప మధ్య ఆస్తులపై ఆధిపత్య పోరుకు మద్రాసు హైకోర్టు వేదికగా మారనుంది. కొడనాడు ఎస్టేట్ సహా అనేక స్థిరాస్తులు, కంపెనీలు తనకే సొంతమని శశికళ ప్రకటించుకోవడాన్ని జయలలిత అన్న కుమార్తె దీప తీవ్రంగా ఖండించారు. శశికళపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. జయ అధికారంలో ఉన్నా లేకున్నా శశికళ అన్నీతానైనట్లుగా వ్యవహరించారు. అధికార పరపతిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లరూపాయల ఆస్తులను సంపాదించినట్లుఆరోపణలున్నాయి. వీటిల్లో అనేక ఆస్తులను జయలలిత, శశికళ సంయుక్త భాగస్వాములుగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొడనాడు ఎస్టేట్ ఎంతో ప్రధానమైనది. భర్త నటరాజన్ అనారోగ్యం, మరణం సందర్భాల్లో శశికళ రెండుసార్లు పెరోల్‌పై చెన్నైకి వచ్చి కొన్నిరోజులు గడిపారు. పెరోల్ ముగిసిన తరువాత ఆమె జైలుకు చేరిన కొద్దిరోజుల్లోనే 2017 నవంబరులో ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం, శశికళ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని భారీ ఆస్తులను గుర్తించారు. అంతేగాక రద్దయిన కరెన్సీకి సంబంధించిన సుమారు రూ.1,900 కోట్ల ఆస్తులను కొనుగోలు, రుణాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ అక్రమ వ్యవహారాలకు సంబంధించి వివరణ కోరుతూ శశికళకు సమన్లు జారీ చేశారు. శశికళ తరఫున ఆమె ఆడిటర్ ఈనెల 11వ తేదీన ఐటీ అధికారులకు బదులిచ్చాడు. జయలలితకు సొంతమైనదిగా ఇటీవల వరకు ప్రచారంలో ఉండిన కొడనాడు ఎస్టేట్, మరో నాలుగు ఆస్తుల్లో 2016 నుంచి ఏప్రిల్ 1 నుంచి జయలలిత మరణించిన అదే ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు శశికళ భాగస్వామిగా మెలిగారు. జయ కన్నుమూసిన తరువాత భాగస్వామ్య సంస్థలు రద్దుకాగా శశికళ వాటి యజమానిగా మారారు. ఈ కారణంగా కొడనాడు ఎస్టేట్ ఆస్తులు శశికళకు సొంతమని ప్రకటించుకున్నారు. దీంతో శశికళ నిర్ణయాలను సవాలు చేస్తూ దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ జయ వారసురాలిగా ఆమె ఆస్తులకు సంబంధించి తాను గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లు విచారణ దశలో ఉన్న పరిస్థితుల్లో కొడనాడు ఎస్టేట్ ఆస్తులను తనకు సొంతమైనవని శశికళ ప్రకటించడం చట్టరీత్యా చెల్లదని అన్నారు. జయ ఆస్తులను సొంతం చేసుకుంటూ శశికళ వద్దనున్న డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని, ముఖ్యంగా భాగస్వామ్య పత్రాలను కోరనున్నట్ల దీప తెలియజేశారు. -
అమ్మ.. చిన్నమ్మా!
రాజకీయాల్లో రాటుదేలిన చిన్నమ్మ.. చెల్లని నోట్లు, నల్లధనమార్పిడిలోనూ సిద్ధహస్తురాలని ఐటీశాఖ తేల్చింది. చెల్లని నోట్లను రుణంగా ఇచ్చి వడ్డీ పొందిన వైనాన్ని బయటపెట్టింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టుకు నివేదించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు పెట్టిన కేసుపై సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేలా అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో శశికళ పిటిషన్ వేసి ఉన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి అనితా సుమంత్ సమక్షంలో గతంలో విచారణకు వచ్చింది. దీనిపై ఐటీశాఖ తరఫున పిటిషన్ దాఖలైంది. పెద్దనోట్ల రద్దు సమయంలో శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించిచెల్లని నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారని ఆ పిటిషన్లో ఐటీశాఖ పేర్కొంది. ఐటీ దాఖలు చేసిన పిటిషన్లో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నమదు ఎంజీఆర్ దినపత్రిక కార్యాలయంలో 2017 నవంబర్ 9వ తేదీన జరిపిన ఐటీ దాడులు సమయంలో ఒక నోటుపుస్తకంలో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. ఈ నోటు పుస్తకం, డాక్యుమెంట్లలోని వివరాలపై ఐటీ ఆరాతీయగా శశికళ బంధువైన శివకుమార్‌కు చెన్నై టీ నగర్‌లోని టీఎన్ హరిచందన ఎస్టేట్ కంపెనీతో సంబంధాలున్నట్లు కంపెనీ మేనేజర్ బాలాజీ తెలిపాడు. ఐటీ అధికారులు శివకుమార్‌ను విచారించగా అపోలో ఆసుపత్రికి వచ్చి తనను కలవాలని 2016 నవంబర్ 16వ తేదీన శశికళ నుంచి పిలుపువచ్చిందని, తాను వెళ్లి కలవగా తిరుచెంగోట్టిలో ఉన్న క్రిస్టీ ప్రైడ్గ్రామ్ పరిశ్రమ అధినేత కుమారస్వామితో మాట్లాడి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చాల్సిందిగా ఆమె చెప్పారని తెలిపాడు. కేంద్ర ప్రభుత్వ ఆహార పథకానికి ఫలసరుకులు, రాష్ట్రంలో పౌష్టికాహార సరఫరా చేసే ప్రభుత్వ కాంట్రాక్టరు కుమారస్వామి అప్పట్లో వ్యవహరించేవారని శివకుమార్ చెప్పాడు. శశికళ ఆదేశాల ప్రకారం కుమారస్వామిని తాను కలిసి.. తమ వ్యాపారాభివృద్ధి కోసం రుణంగా కొన్ని కోట్ల రూపాయల చెల్లని నోట్లను ఇస్తాం, ఇందుకు బదులుగా ఒక ఏడాది తరువాత 6 శాతం వడ్డీతో సహా రూ.2000తో కూడిన కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుదుర్చుకున్నానన్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముందు రోజన లావాదేవీలను పూర్తిచేసుకున్నామన్నారు. చెన్నై టీనగర్ వన్నియర్ వీధిలోని కాటేజ్ బ్లేడు రిసార్ట్ సంస్థ కార్యాలయం నుంచి తొలి విడతగా డిసెంబర్ 29వ తేదీన రూ.101 కోటి, రెండో విడతగా అదే నెల 30వ తేదీన రూ.136 కోట్లు లెక్కన రూ.237 కోట్లను చెల్లించామని ఐటీ అధికారులకు శివకుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. దీని ఆధారంగా గత ఏడాది జూలై 5వ తేదీన తిరుచెంగోడులోని కుమారస్వామికి చెందిన కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. శశికళ ద్వారా నగదు తీసుకున్నట్లు కుమారస్వామి, ఆయన కుమారుడు తిరుపతి అధికారుల వద్ద అంగీకరించారు. ఇదికాకుండా రూ.1911.50 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి శశికళ గోప్యంగా ఉంచి పన్ను కట్టలేదు. ఎంజీఆర్, జయలలిత జన్మదినాల్లో నమదు ఎంజీఆర్ దినపత్రికలో పార్టీ నేతల పేర్లతో భారీ ప్రకటనలు వచ్చాయి. అయితే వారెవరూ తాము ప్రకటనలు ఇవ్వలేదని ఐటీ అధికారులకు తెలిపారు. శశికళనే ఆ ప్రకటనలు ఇచ్చి నల్లధనాన్ని మార్చినట్లు తేలిందని ఐటీశాఖ కోర్టుకు సమర్పించిన పిటిషన్లో వివరించింది. -
శశికళ ఇల్లు కూల్చివేతకు నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కూలిపోయేస్థితికి చేరుకున్న ఇంటిలో కాపురమా..ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరమ్మా బాధ్యులంటూ తంజావూరు కార్పొరేషన్ అధికారులు చిన్నమ్మను నిలదీశారు. మీరు కూల్చకుంటే మేమే ఆ పనిచేస్తామని హెచ్చరిస్తూ బుధవారం సాయంత్రం ఇంటిగోడపై నోటీసు అంటించారు. తమిళనాడు ప్రజలకు చిన్నమ్మ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అమ్మ తరువాత చిన్నమ్మే అన్నంతగా పేరుబడిన శశికళ పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పారు. శశికళకు సంబంధించి ఏ చిన్న అంశమైనా రాష్ట్రంలో చర్చనీయాంశమే. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో మూడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నా ఏదోరకంగా వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నారు. తంజావూరులోనిశశికళ సొంతింటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం ద్వారా చిన్నమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు చెన్నై, తంజావూరులలో సొంతిళ్లు ఉన్నాయి. తంజావూరులో 10,500 చదరపు అడుగుల్లోని సొంతింటిలో మనోహర్ అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. తంజావూరు కార్పొరేషన్ అధికారులు గత నెల ఆ ఇంటిని పరిశీలించి నివాసయోగ్యం కానంతగా పాడుబడి పోయి ఉందని నిర్ధారించారు. ఈ ఇంటిని వెంటనే కూల్చకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ శశికళ, అద్దెకున్న మనోహర్‌కు కార్పొరేషన్ కమిషనర్ జానకీ రవిచంద్రన్ నోటీసులు జారీచేశారు. నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి. తంజావూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్పీజీ మిషన్ ఉన్నతపాఠశాల రోడ్డులో ప్రమాదస్థితిలోని ఉన్న శశికళ ఇంటిని కూల్చివేయకతప్పదు. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇంటిని ఖాళీచేయకుంటే ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలకు ఇంటి యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేగాక కార్పొరేషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటూ నిర్మాణాన్ని తొలగించేందుకు అయిన ఖర్చులను ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు జారీచేసిన తరువాత కూడా ఇంటిని కూల్చకపోవడం, ఖాళీ చేయకపోవడం తంజావూరు తహశీల్దారు వెంకటేశన్, కార్పొరేషన్ ఇంజినీర్లు బుధవారం సాయంత్రం శశికళ ఇంటికి చేరుకుని మనోహరన్‌ను విచారించారు. చెన్నైలోని శశికళ బంధువులకు నోటీసు విషయం చెప్పాను, ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవ్వరూ నివసించడం లేదు, తాను వెనుకనున్న పోర్షల్ ఉంటున్నానని మనోహరన్ అధికారులకు వివరించాడు. దీంతో శశికళ ఇంటి ప్రవేశద్వారంలోని గోడపై నోటీసు అంటించారు. ఇంటిని ఖాళీచేసి కూల్చివేయాల్సిందిగా నోటీసులో ఇచ్చిన గడువు తీరిపోయింది, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు మనోహరన్‌ను నిలదీశారు. ఇంటిపై నోటీసు అంటించిన కారణంగా వెంటనే ఖాళీచేయాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శశికళ ఇంటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. -
వదినమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ వదినమ్మ ఇలవరసి ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, వజ్రాలు వంటి ఆభరణాలు అహరణకు గురి అయ్యాయి. ఆలస్యంగా కుటుంబీకులు పోలీసుల్ని ఆశ్రయించారు.అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఏళ్ల తరబడి ఆమె వదినమ్మ ఇలవరసి ఉన్న విషయం తెలిసిందే. అందుకే అ›క్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటు ఇలవరసి కూడా ఊచలు లెక్కించక తప్పలేదు. ఇలవరసికి నుంగంబాక్కం మహాలింగపురం రామనాథర్ వీధిలో అతి పెద్ద భవనం ఉంది. ఇందులో ఆమె కుమారుడు వివేక్ నివాసం ఉన్నారు. ప్రస్తుతం చిన్నమ్మ శశికళతో కలిసి వదినమ్మ ఇలవరసి పరప్పన అగ్రహార చెరలో ఉన్నారు. ఇటీవల పరోల్ మీద ఇలవరసి బయటకు వచ్చారు. మహాలింగపురంలోని నివాశంలోనే ఆమె ఉన్నారు. ఎనిమిదో తేదీన పరోల్ ముగియడంతో ఆమె మరలా పరప్పన అగ్రహార చెరకు వెళ్లారు. ఆమెతో పాటు తనయుడు వివేక్, ఇతర బంధువులు వెంట వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉండ లేక వివేక్ భార్య అన్నానగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. దీంతో ఇంటి వద్ద అసోంకు చెందిన కోనార్క్(26) సెక్యూరిటీ మాత్రమే ఉన్నాడు. రాత్రి వివేక్ నమ్మిన బంటు, అంబత్తూరుకు చెందిన డ్రైవర్ మురళి(38) ఆ ఇంటికి వచ్చాడు. తనకు కేటాయించిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా, ఇంటి తలుపులు తెరచి ఉండడం, ఎవ్వరూ లేకపోవడంతో వివేక్ మేనేజర్ ప్రసన్నకు సమాచారం ఇచ్చాడు. తొమ్మిదో తేదీ రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరుకున్న వివేక్ కుటుంబీకులు అక్కడున్న గదులను పరిశీలించారు. అన్ని చోట్ల సమగ్ర పరిశీలనకు సమయం తీసుకున్నారో లేదా , చిన్న దొంగతనమే అని భావించారా ఏమోగానీ, తొలుత పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. చివరకు ఇంట్లో ఉన్న ఆభరణాలు, వజ్రాలు మాయం కావడం , సెక్యూరిటీ కోనార్క్ పత్తా లేకుండా పోవడంతో శనివారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడం అనుమానాలకు దారి తీసినా, తమ బాధ్యతగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 750 గ్రాముల బంగారం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, విలువైన వస్తువుల్నే అపహరించుకు వెళ్లి ఉంటారన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో రెండు ప్రత్యేక బృందాలు ఆదివారం రంగంలోకి దిగాయి. కోనార్క్ ఆరు నెలల క్రితం ఇక్కడకు వచ్చినట్టు విచారణలో తేలింది. దీంతో విచారణ మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. -
చిన్నమ్మే వారసురాలు..!
-
చిన్నమ్మే వారసురాలు!
- ప్రధాన కార్యదర్శి పదవికి శశికళే అర్హురాలన్న సెల్వం - ఆమెకు మద్దతుగా నిలుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేదెవరోనని పార్టీ కేడర్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ‘అమ్మ’ రాజకీయ వారసురాలు చిన్నమ్మ శశికళే నని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశారుు. తమిళ నాడు సీఎం పన్నీరుసెల్వం, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు నేతలందరూ తమకిక చిన్నమ్మే దిక్కని ముక్తకంఠంతో ప్రకటించారు. సీఎం పన్నీరు సెల్వం, మంత్రుల బృందం ఆదివారం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని శశికళతో సమావేశమయ్యారు. చిన్నమ్మే ప్రధానకార్యదర్శి పగ్గాలు చేప ట్టాలని 31 మంది మంత్రులు మద్దతు పలకడమేగాక, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సమావేశానంతరం మీడియా ముందుకొచ్చిన మంత్రులు అమ్మకు నీడగా ఉన్న శశికళకు పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు శశికళకున్నాయని సీఎం పన్నీరుసెల్వం తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘అమ్మ’కు ఎదురైన కష్టనష్టాల్లో పాలు పంచుకున్న చిన్నమ్మకు మద్దతుగా ఐక్యతతో అందరం ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కొన్నిచోట్ల కేడర్ నుంచి ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శశికళకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకొచ్చి మరీ తమ నిరసన తెలుపుతున్నారు. మెరీనాకు పోటెత్తిన జనం ఆదివారం సెలవుదినం కావడంతో ఇక్కడి మెరీనా తీరంలోని ‘అమ్మ’ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి వి.జయరామన్, మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్.పి. వేలుమణితో పాటు 500 మంది అన్నాడీఎంకే సభ్యులు ఆదివారం గుండు గీరుుంచుకుని తమ విధేయత చాటుకున్నారు. సినీ నటి త్రిష ఆదివారం ఉదయాన్నే తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి జయలలిత సమాధిని దర్శించుకుని నివాళి ఘటించారు. ఇదిలావుంటే.. జయలలిత మృతిని తట్టుకోలేక షాక్‌తో ఇంత వరకూ 470 మంది మరణించారని అన్నాడీఎంకే ఆదివారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పేర్కొంది. -
అమ్మ చెప్పింది.. చిన్నమ్మే వారసురాలు!
శశికళను స్వయంగా జయలలిత గుర్తించారు: తంబిదురై కోయంబత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు ఎవరు, ఆమె స్థానంలో అధికార అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతాంటే.. ఆమె నిచ్చెలి శశికళ పేరు వినిపిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు సీఎం ఓ పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళను కోరగా.. తాజాగా మరో సీనియర్ నాయకుడు కూడా వారితో గొంతు కలిపారు. అన్నాడీఎంకేలో బలమైన నేతగా పేరొందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై కూడా చిన్నమ్మ శశికళకే ఓటేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నమ్మ కు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని పేర్కొన్నారు. 'చిన్నమ్మ అమ్మ (జయలలిత)తో కలిసి 35 ఏళ్లు గడిపారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. రాజకీయ విరోధం కారణంగా ఆమెపై నకిలీ కేసులు నమోదుచేశారు. జైలుకు కూడా పంపారు. ఎన్నో ముప్పుల నుంచి అమ్మను చిన్నమ్మ కాపాడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో అమ్మకు సలహాలు ఇచ్చింది' అని తంబిదురై అన్నారు. చిన్నమ్మ సలహాల ప్రకారం నడుచుకోవాలని జయలలిత తనకు ఎన్నోసార్లు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ‘జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ‘పురచ్చితలైవీ అమ్మ’ అని పిలిచేవారు. శశికళ అమ్మతో చాలాకాలంగా ఉండటంతో మేం ఆమెని ‘చిన్నమ్మ’ అని పిలిచేవాళ్లం. దీనిని అమ్మ గుర్తించడమే కాదు ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. అన్నాడీఎంకే వారసురాలు చిన్నమేనని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని తంబిదురై పేర్కొన్నారు. -
మళ్లీ డుమ్మా
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్ ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం ఏళ్ల తరబడి చెన్నై ఎగ్మూర్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నాలుగు నెలల్లో ముగించే విధంగా ఆ కోర్టు ముందుకెళుతోంది. అయితే, విచారణల పర్వం వాయిదాల మీద వాయిదాలతో సాగుతుండడంతో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కాస్త ముగింపు దశకు చేరింది. 29 వరకు బిజీ: విచారణ నిమిత్తం ఉదయం ఆర్థిక నేరాల కోర్టుకు జయలలిత, శశికళ హాజరవుతారన్న ప్రచారం సాగడంతో అక్కడ మీడియా హడావుడి మొదలైంది. అయితే, ఆ ఇద్దరూ రాలేదు. వారి తరపున వచ్చిన న్యాయవాదులు వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. సీఎం జయలలిత విచారణకు హాజరు కాలేరని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంటూ అందులో వివరించారు. ఈ నెల 29 వరకు ఆమె బిజీ షెడ్యూల్‌ను ముందుగానే రూపొందించి ఉన్న దృష్ట్యా, కోర్టుకు హాజరయ్యే విషయమై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, శశికళ పంటి నొప్పితో బాధ పడుతున్నారని, ఆమెకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉన్నందున ఆమెకు కూడా మినహాయింపు కల్పించాలని కోరారు. ఆ ఇద్దరు డుమ్మా కొట్టడంతో విచారణ వాడి వేడిగా సాగింది. ఉదయం కాసేపటి తర్వాత విచారణ వాయిదా పడగా, మళ్లీ మధ్యాహ్నం ఆరంభం అయింది. 40 నిమిషాల పాటుగా సాగిన విచారణలో జయలలిత, శశికళ, ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. చివరకు తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. ఆ రోజు జరిగే విచారణకు జయలలిత, శశికళ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించారు. తాను సంధించే ప్రశ్నలకు ఆ ఇద్దరు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ, ఒక వేళ ఆ తేదీ వాయిదా పడిన పక్షంలో జూలై మొదటి వారంలోపు కేసును తుది దశకు తీసుకెళ్లే విధంగా జస్టిస్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జాప్యం : జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు వాయిదాల మీద వాయిదాలను వేయించుకుంటూ ముందుకెళుతుండడాన్ని ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామి తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ఇది వరకు ఓ మారు కోర్టుకు రావాలని ఆదేశిస్తే, ఎన్నికలను సాకుగా చూపించడాన్ని ఇప్పటికే ఆయన తప్పుబట్టారు. ఆ సమయంలో ఇచ్చిన గడవు మేరకు సోమవారం విచారణకు జయలలిత, శశికళ హాజరు కావాల్సి ఉన్నా, ఆ ఇద్దరు డుమ్మా కొట్టడాన్ని కేవలం వాయిదాలతో జాప్యం చేస్తున్నారన్న అసహనాన్ని ఆయన వ్యక్తం చేయడం గమనార్హం.