జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేదెవరోనని పార్టీ కేడర్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ‘అమ్మ’ రాజకీయ వారసురాలు చిన్నమ్మ శశికళే నని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశారుు. తమిళ నాడు సీఎం పన్నీరుసెల్వం, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు నేతలందరూ తమకిక చిన్నమ్మే దిక్కని ముక్తకంఠంతో ప్రకటించారు. సీఎం పన్నీరు సెల్వం, మంత్రుల బృందం ఆదివారం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని శశికళతో సమావేశమయ్యారు. చిన్నమ్మే ప్రధానకార్యదర్శి పగ్గాలు చేప ట్టాలని 31 మంది మంత్రులు మద్దతు పలకడమేగాక, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.