chinnamma
-
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
చిన్నమ్మకు పెద్ద సవాల్
-
చిన్నమ్మే వారసురాలు..!
-
చిన్నమ్మే వారసురాలు!
- ప్రధాన కార్యదర్శి పదవికి శశికళే అర్హురాలన్న సెల్వం - ఆమెకు మద్దతుగా నిలుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేదెవరోనని పార్టీ కేడర్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ‘అమ్మ’ రాజకీయ వారసురాలు చిన్నమ్మ శశికళే నని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశారుు. తమిళ నాడు సీఎం పన్నీరుసెల్వం, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు నేతలందరూ తమకిక చిన్నమ్మే దిక్కని ముక్తకంఠంతో ప్రకటించారు. సీఎం పన్నీరు సెల్వం, మంత్రుల బృందం ఆదివారం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని శశికళతో సమావేశమయ్యారు. చిన్నమ్మే ప్రధానకార్యదర్శి పగ్గాలు చేప ట్టాలని 31 మంది మంత్రులు మద్దతు పలకడమేగాక, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సమావేశానంతరం మీడియా ముందుకొచ్చిన మంత్రులు అమ్మకు నీడగా ఉన్న శశికళకు పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు అన్ని అర్హతలు శశికళకున్నాయని సీఎం పన్నీరుసెల్వం తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘అమ్మ’కు ఎదురైన కష్టనష్టాల్లో పాలు పంచుకున్న చిన్నమ్మకు మద్దతుగా ఐక్యతతో అందరం ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కొన్నిచోట్ల కేడర్ నుంచి ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శశికళకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకొచ్చి మరీ తమ నిరసన తెలుపుతున్నారు. మెరీనాకు పోటెత్తిన జనం ఆదివారం సెలవుదినం కావడంతో ఇక్కడి మెరీనా తీరంలోని ‘అమ్మ’ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి వి.జయరామన్, మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్.పి. వేలుమణితో పాటు 500 మంది అన్నాడీఎంకే సభ్యులు ఆదివారం గుండు గీరుుంచుకుని తమ విధేయత చాటుకున్నారు. సినీ నటి త్రిష ఆదివారం ఉదయాన్నే తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి జయలలిత సమాధిని దర్శించుకుని నివాళి ఘటించారు. ఇదిలావుంటే.. జయలలిత మృతిని తట్టుకోలేక షాక్‌తో ఇంత వరకూ 470 మంది మరణించారని అన్నాడీఎంకే ఆదివారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పేర్కొంది. -
ఇక చిన్నమ్మ సేన
సాక్షి, చెన్నై : అమ్మ సేనలు అన్న పేరు మరుగున పడి, ఇక చిన్నమ్మ సేన తెర మీదకు రానుంది. అమ్మ జయలలిత రాజకీయ వారసురాలు శశికళ అన్న విషయాన్ని పార్టీ పెద్దలు తేల్చడంతో అభిమానాన్ని చాటుకునే పనిలో అత్యుత్సాహం ప్రదర్శించడంలో సేనలు దూసుకెళుతున్నారు. చిన్నమ్మ ఫొటోలు, పేర్లతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఏ మేరకు ద్వితీయ, తృతీయశ్రేణి కేడర్ ఉత్సాహాన్ని చూపుతున్నదో అదే స్థాయిలో వ్యతిరేకత అనేక చోట్ల వ్యక్తం అవుతోంది. పురట్చితలైవి జయలలిత మీద అన్నాడీఎంకే వర్గాలకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మరణం ఆ పార్టీ వర్గాలకు తీరని లోటే. అందుకే ఆ లోటును చిన్నమ్మ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. నాయకులు ఎందరో ఉన్నా, పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం సాగించేంత కీలక వ్యక్తి అన్నాడీఎంకేలో లేరు. ఈ దృష్ట్యా, జయలలితకు నీడలా ఉంటూ, ఆమె కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పోయెస్ గార్డెన్ వేదికగా రాజకీయ వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్న చిన్నమ్మే ఇక, తమకు అమ్మ అన్న నిర్ణయానికి అన్నాడీఎంకే పెద్దలు వచ్చేశారు. చిన్నమ్మే దిక్కు అంటూ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నగర, పట్టణ, గ్రామ కమిటీల కార్యదర్శులు పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు చిన్నమ్మా...పగ్గాలు చేపట్టమ్మా అంటూ వేడుకుంటుంటే, జిల్లా మొదలు గ్రామ స్థారుు నాయకులు ఇక చిన్నమ్మే....తమ అమ్మా అని చాటుకునే విధంగా పరుగులు తీయడానికి సిద్ధం అవుతుండడం గమనార్హం. సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులు, ఎంపీలు అందరూ చిన్నమ్మే ఇక అమ్మ రాజకీయ వారసురాలు అని స్పష్టం చేయడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ ఉత్సాహాన్ని, అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. పత్రికల్లో చిన్నమ్మకు ఆహ్వానం పలికే రీతిలో ప్రకటనల్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లు అమ్మ సేనలం అని చెప్పకుంటున్న వాళ్లు, ఇక ఆ పేరును తెర మరుగు చేసి చిన్నమ్మ సేనలుగా తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక, ఎంజీఆర్, జయలలిత తదుపరి, చిన్నమ్మే అంటూ వారి ముఖ చిత్రాలతో ఫ్లెక్సీలను హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అమ్మ మార్గంలో మా చిన్నమ్మా...!, నాడు...నేడు..రేపు , భూమి ఉన్నంత వరకు అమ్మే..! అన్న నినాదాలతో ఈ హోర్డింగ్‌లు హోరెత్తుతున్నాయి. ఇన్నాళ్లు జయలలిత హోర్డింగ్‌లు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండడంతో, వాటిని తొలగించడం లక్ష్యంగా కోర్టులో పెద్ద సమరమే చేసిన ఘనత సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి దక్కుతుంది. ఇక, చిన్నమ్మ ఫ్లెక్సీల భరతం పట్టే విధంగా ట్రాఫిక్ ఉరకలు తీసినా తీయొచ్చేమో...!. కాగా, కొందరు చిన్నమ్మ మీద భక్తిని చాటుకునే విధంగా పరుగులు తీస్తుంటే, అదే స్థాయిలో మరెందరో తమ అమ్మ స్థానంలో మరొకర్ని సహించబోమన్నట్టుగా నిరసనలు వ్యక్తం చేస్తుండడం ఆలోచించాల్సిందే. మెజారిటీ శాతం చిన్నమ్మకు మద్దతుగా పెద్దల పయనం సాగుతున్నా, కింది స్థాయి కేడర్‌లో మాత్రం ఆ స్పందన కరువైనట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. కొందరు అయితే, చిన్నమ్మకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకు వస్తుండడం కొసమెరుపు. చిన్నమ్మకు వ్యతిరేకత : చిన్నమ్మకు వ్యతిరేకంగా పుదుచ్చేరి అన్నాడీఎంకే సీనియర్, మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్ గళం విప్పారు. అమ్మ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్న విషయాన్ని మరచి, ప్రస్తుతం నాయకుల తీరు ఉన్నదని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శిగా మరొకర్ని నియమించడానికి వీలు లేదని, అమ్మే ఆ పదవికి శాశ్వతం అని పేర్కొన్నారు. మరొకర్ని ఆ పదవిలో నియమిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, శశికళను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే ప్రయత్నాలను ఖండించారు. ఆ పదవికి ఆమె అనర్హురాలుగా వ్యాఖ్యానించారు. అలాగే, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, శశికళ పగ్గాలు చేపట్టిన పక్షంలో అన్నాడీఎంకే రెండుగా చీలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు అమ్మ జయలలితకు కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చిన సేనలు, ప్రస్తుతం చిన్నమ్మ కాళ్ల మీద పడే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో పలువురు నేతల సాష్టాంగ నమస్కారాల వీడియో వాట్సాప్‌లలో హల్చల్ చేస్తున్నాయి. -
అమ్మ చెప్పింది.. చిన్నమ్మే వారసురాలు!
శశికళను స్వయంగా జయలలిత గుర్తించారు: తంబిదురై కోయంబత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు ఎవరు, ఆమె స్థానంలో అధికార అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతాంటే.. ఆమె నిచ్చెలి శశికళ పేరు వినిపిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు సీఎం ఓ పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళను కోరగా.. తాజాగా మరో సీనియర్ నాయకుడు కూడా వారితో గొంతు కలిపారు. అన్నాడీఎంకేలో బలమైన నేతగా పేరొందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై కూడా చిన్నమ్మ శశికళకే ఓటేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పగ్గాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నమ్మ కు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని పేర్కొన్నారు. 'చిన్నమ్మ అమ్మ (జయలలిత)తో కలిసి 35 ఏళ్లు గడిపారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. రాజకీయ విరోధం కారణంగా ఆమెపై నకిలీ కేసులు నమోదుచేశారు. జైలుకు కూడా పంపారు. ఎన్నో ముప్పుల నుంచి అమ్మను చిన్నమ్మ కాపాడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో అమ్మకు సలహాలు ఇచ్చింది' అని తంబిదురై అన్నారు. చిన్నమ్మ సలహాల ప్రకారం నడుచుకోవాలని జయలలిత తనకు ఎన్నోసార్లు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ‘జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ‘పురచ్చితలైవీ అమ్మ’ అని పిలిచేవారు. శశికళ అమ్మతో చాలాకాలంగా ఉండటంతో మేం ఆమెని ‘చిన్నమ్మ’ అని పిలిచేవాళ్లం. దీనిని అమ్మ గుర్తించడమే కాదు ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. అన్నాడీఎంకే వారసురాలు చిన్నమేనని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని తంబిదురై పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దర మహిళలు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది. లచ్చమ్మ (60), అంబారు చిన్నమ్మ (55)లు ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా సిమెంట్ లారీ వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖపై కన్నేసిన చిన్నమ్మ
-
పేరిపిని వణికిస్తున్న విషజ్వరాలు
పేరిపి(చీపురుపల్లి రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని పేరిపి గ్రామాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా జ్వరపీడితులు మంచాలపై మూలుగుతున్నా రు. గ్రామంలో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన 50 మంది వరకూ జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకేఇంట్లో కొత్తవలస లక్ష్మునాయుడు, చిన్నమ్మలు, అయ్యప్ప, లక్ష్మి, గ్రామానికి చెందిన యలకల తవుడు, కోట్ల ఈశ్వరమ్మ, మోపాడ మహేష్, మోపాడ అప్పమ్మ, మోపాడ సన్యాసమ్మ, యలకల దాలినాయుడు తదితరులు జ్వరంతో బాధ పడుతున్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మోపాడ ఉపేంద్ర అనే విద్యార్థికి డయేరియా సోకిందని, ప్రస్తుతం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. జ్వరపీడితులను ఆస్పత్రులకు తరలించామని, రక్తపరీక్షల్లో మలేరియా ఉన్నట్లు తేలిందని చెప్పారు. మరోవైపు ఆర్థిక స్తోమత చాలక చాలామంది ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. కర్లాం పీహెచ్‌సీకి చెందిన ఏఎన్ఎం మంగళవారం గ్రామంలోకి వచ్చి మందులు ఇచ్చి వెళ్లారే తప్ప, కనీసం పరీక్షలు జరపలేదని పలువురు జ్వరపీడితులు వాపోయారు. ఇదే విషయమై సీహెచ్ఎన్సీ, ఎస్పీహెచ్ఓ డాక్టర్ నీలకంఠేశ్వరరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, రోగులను పరీక్షిస్తామని చెప్పారు.