తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పెరుగుతోంది. అన్నాడీఎంకే చెందిన మరో ఇద్దరు ఎంపీలు సెల్వం వర్గంలో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం ప్రకటించారు. నిన్నటివరకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతుగా ఉన్న వీరు ఆమెకు ఝలక్ ఇచ్చి సెల్వం గూటికి చేరారు. అన్నా డీఎంకేలో చీలికలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని ఆందోళన చెందుతున్న శశికళ వర్గానికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.