
‘కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలొద్దనే పొత్తు’
కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణలో తాము పొత్తుకు సిద్ధపడ్డామని బీజేపీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణలో తాము పొత్తుకు సిద్ధపడ్డామని బీజేపీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని కావద్దన్న ఉద్దేశంతో అవకాశవాద పార్టీలు, మతతత్వ పార్టీలు తీవ్రంగా కుట్రపన్నుతున్నాయని, ఈ దిశలో ఆయన ప్రధాని అయ్యేందుకు వీలుగా ఈ పొత్తులు ఉపయోగపడతాయన్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తె లుగుదేశం పార్టీతో తమ అధినాయకత్వం పొత్తుల అంశంపై చ ర్చిస్తోందని, అది రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరే ప్రాథమిక సూత్రం పొత్తులవద్ద పనిచేస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.