
ఒకే సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు
తెలుగు రాష్ట్రాలు ఒకే సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు లాంటివని విద్యాసాగర్‌రావు అన్నారు.
ఏపీ, తెలంగాణలపై మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్య
రాజాం: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఒకే సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు లాంటివని మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాల గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యా నించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగుభాషను కాపాడుకోవాలన్నారు. 12వ తరగతి వరకూ తెలుగు భాషలోనే పాఠ్యాంశాలను బోధిస్తే బాగుంటుందని ఆయన ప్రభుత్వాలకు సూచించారు.
మాధ్యమిక స్థాయి వరకూ తెలుగులో బోధన చేస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావ్యవస్థలోనూ, సమాజంలోనూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు ప్రపంచం చెప్పుకునేలా శాటిలైట్‌ను ప్రయోగిం చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ విద్యాసంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు.