జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్ రావు శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు. (తమిళనాట సర్వత్రా ఉత్కంఠ!)
జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి చైర్మన్ పత్రాప్ రెడ్డి తనకు వివరించారని గవర్నర్ తెలిపారు. జయలలితకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రకటనతో జయలలిత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన కొంత తగ్గింది.