
సీహెచ్ విద్యాసాగర్ రావు
మహారాష్ట్రలో అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు.
ముంబై: మహారాష్ట్రలో అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. శాసనసభలోకి వస్తున్న గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ ఘటనలో విద్యాసాగర్ రావు ఎడమ చేతికి గాయమైంది. ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచితంగా ప్రవర్తించిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు కూడా గాయపడినట్లు రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ బోండ్రే, అమర్ కాలే, రంజిత్ కాంబ్లే, విజయ్ వాడెట్టివార్, అబ్దుల్ సత్తార్లు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆయన తెలిపారు. క్షమాపణలు చెప్పడంతో ఈ సమస్య పరిష్కారం కాదని ఏక్నాథ్ ఖడ్సే అన్నారు.
**