తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతున్న వీకే శశికళ సమర్పించిన సంతకాలు సరైనవో కావో చూడాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. దాదాపు అరగంట పాటు తన వాదన వినిపించడంతో పాటు, పది అంశాలతో కూడిన ప్రజంటేషన్ కూడా ఇచ్చిన శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతా కలిసి తనను ఎలా శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారో కూడా గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకంటే ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కలిశారు.