సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో వ్యవహరించినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు ప్రశ్నించారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు బీజేపీపై అనుమానాలు వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో బిల్లును పార్లమెంట్‌లో పెడితే బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బిల్లు పెడితే అండగా ఉంటాం: విద్యాసాగరరావు
Published Sun, Feb 2 2014 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement